ఏపీలో బీజేపీ పరిస్తితి ఏ మాత్రం మెరుగుపడేలా కనిపించడం లేదు. రోజురోజుకూ బీజేపీ పరిస్తితి దిగజారుతుందే తప్ప, మెరుగు పడటం లేదు. జనసేనతో పొత్తు పెట్టుకున్న సరే ఆ పార్టీ పరిస్తితి అలాగే ఉంది. అదే నోటాతో బీజేపీ పోటీ పడే పరిస్తితి కనిపిస్తోంది. అసలు ఏపీలో బీజేపీ ఎప్పటికీ సత్తా చాటేలా కనిపించడం లేదు. ఏదో 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగు ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లని గెలుచుకుంది. కానీ 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి కనీసం నోటా ఓట్లని దాటని పరిస్తితి. 175 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయే పరిస్తితి.

ఇక ఆ తర్వాత జనసేనతో కలిసిన కనీసం స్థానిక ఎన్నికల్లో సత్తా చాటలేని పరిస్తితుల్లో బీజేపీ ఉంది. అసలు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా సరే, ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో బీజేపీ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా సరే రాష్ట్రంలో సత్తా చాటలేకపోతుంది. ఒక వైపు తెలంగాణలో బీజేపీ, అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తుంది.

కానీ ఏపీలో మాత్రం బీజేపీ నేతలు వైసీపీతో అంటకాగే పరిస్తితులు ఉన్నాయి. అందుకే రాష్ట్రంలో బీజేపీ ఏ మాత్రం పికప్ అవ్వలేకపోతుంది. దీనిపై అమిత్ షా కూడా రాష్ట్ర నేతలకు క్లాస్ పీకినట్లు తెలిసిందే. అయితే ఇకనుంచైనా రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా పనిచేసే అవకాశాలు ఉన్నాయో లేదో తెలియడం లేదు. ఎంత దూకుడుగా ఉన్నా సరే ప్రజలు ఆదరించే పరిస్తితి లేదు. కేంద్రం నుంచి రాష్ట్రాన్ని ఆదుకుంటే అప్పుడు పజాలు బీజేపీని ఆదరిస్తారు. లేదంటే అప్పటివరకూ ఇంతే.

అయితే గత ఎన్నికల తర్వాత సేఫ్ సైడ్‌గా బీజేపీలోకి వెళ్ళిన నేతలు, వచ్చే ఎన్నికల ముందు బయటకొచ్చేసి వేరే పార్టీల్లో చేరిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటే ఆగుతారేమో గానీ, లేదంటే నేతల జంపింగులు ఫిక్స్.

Discussion about this post