రాష్ట్రంలో బూతులు మాట్లాడే నేతలు ఎవరు అంటే..అందులో మొదటగా చెప్పే పేరు కొడాలి నాని అని చెప్పవచ్చు. ఇక ఈయన వేరే వాళ్ళని పెద్దగా టచ్ చేయరు గాని..కేవలం చంద్రబాబుని మాత్రమే బండ బూతులు తిడతారు. అంటే ఇద్దరు కమ్మ వర్గం కావడంతో..బాబుని కొడాలి మాత్రమే ఎక్కువ తిడతారు. అలా తిట్టే కార్యక్రమం చేసే కొడాలి..తాజాగా కూడా అదే పనిలో పడ్డారు.
టిడిపి మహానాడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక బాబుని నానా రకాలుగా తిట్టారు. ఇదే సమయంలో కొడాలి అనూహ్యంగా పవన్ పై విమర్శలు చేస్తూనే..కాపుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాపు నా…లు అంటూ దారుణంగా మాట్లాడారు. ఇప్పుడు అలా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని కాపు వర్గం తీవ్ర స్థాయిలో స్పందిస్తుంది..కొడాలి పై మండిపడుతుంది. కాపులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాపులని తిట్టిన కొడాలిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని జగన్ని కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారు.

టిడిపి , జనసేనల్లోనే కాకుండా ఇతర కాపు నేతలు కొడాలిపై ఫైర్ అవుతున్నారు. ఇక గుడివాడలో కాపు ఓటర్లు ఎక్కువనే..వారే కొడాలికి బుద్ధి చెబుతారని అంటున్నారు. అయితే కాపులని తిట్టిన అంశం కొడాలికి మైనస్ అవుతుంది. ఇంతకాలం గుడివాడలో కాపులు కొడాలికే సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది.
ఇప్పటికే టిడిపి-జనసేన కలుస్తున్న నేపథ్యంలో కొడాలికి గుడివాడలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది. ఇదే తరుణంలో కాపులని తిట్టడం కొడాలికి పెద్ద మైనస్ గా మారే ఛాన్స్ ఉంది. చూడాలి మరి కాపుల అంశం కొడాలికి ఎంతవరకు డ్యామేజ్ చేస్తుందో.