శ్రీకాకుళం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే…జిల్లాలో పలు నియోజకవర్గాలు టీడీపీకి మొదట నుంచి కంచుకోటలుగా ఉంటున్నాయి…ఇక ఆ స్థానాల్లో టీడీపీ ముందు నుంచి సత్తా చాటుతూనే ఉంది..కానీ టీడీపీకి పెద్ద పట్టు లేని స్థానాలు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి..అలా టీడీపీకి ఏ మాత్రం పట్టు లేని స్థానాల్లో నర్సన్నపేట కూడా ఒకటి. ఇక్కడ టీడీపీ ఎక్కువసార్లు గెలవలేదు..1983, 1985, 1994, 2014 ఎన్నికల్లోనే టీడీపీ విజయం సాధించింది…ఇక మెజారిటీ సార్లు కాంగ్రెస్ గెలిచింది. అందులోనూ ధర్మాన బ్రదర్స్ ఇక్కడ సత్తా చాటుతూ వస్తున్నారు.

1989, 1999 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు నర్సన్నపేట నుంచి గెలవగా, తర్వాత ధర్మాన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ 2004, 2009, 2012 ఉపఎన్నిక, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కృష్ణదాస్…తర్వాత వైసీపీలోకి వెళ్ళి 2012 ఉపఎన్నికలో గెలిచారు..2014 ఎన్నికల్లో ఓటమి పాలవ్వగా, 2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు.

అలాగే జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఛాన్స్ కూడా కొట్టేశారు…ఇక ఇప్పుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం హోదా కూడా దక్కించుకున్నారు…అయితే రాష్ట్రంలో చాలామంది మంత్రుల పనితీరు సరిగా లేదనే చెప్పొచ్చు…అలాగే పలువురు మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో కూడా బాగా వెనుకపడ్డారు…వారు ప్రజా వ్యతిరేకతని తెచ్చుకున్నారు. కానీ కృష్ణదాస్ అలా కాదు..మంత్రిగా ఈయన పనితీరు గొప్పగా లేకపోయిన సరే.తన నియోజకవర్గానికి వచ్చేసరికి మంచి పొజిషన్ లోనే ఉన్నారు.

ఇప్పటికీ కృష్ణదాస్ పై పెద్దగా వ్యతిరేకత పెరగలేదని తెలుస్తోంది. ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో శ్రీకాకుళం జిల్లాలో మిగిలిన స్థానాల్లో టీడీపీ గెలుపుపై చర్చ జరుగుతుంది గాని…నర్సన్నపేటలో మాత్రం జరగడం లేదు…ఇక్కడ టీడీపీ అంత బలపడినట్లు కనిపించడం లేదు..అదే సమయంలో కృష్ణదాస్ బలం కూడా పెద్దగా తగ్గినట్లు లేదు..మొత్తానికి నర్సన్నపేటలో కృష్ణదాస్ కు చెక్ పెట్టడం అంత సులువు కాదనే చెప్పొచ్చు.

Discussion about this post