కడప అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు…కడప ప్రజలు ఏ స్థాయిలో వైసీపీకి మద్ధతు ఉంటారో గత రెండు ఎన్నికల్లోనూ అర్ధమవుతుంది…మరి ఇలా వన్ సైడ్‌గా వైసీపీకి మద్ధతుగా ఉంటూ వస్తున్న కడప ప్రజలు ఈ సారి ఎన్నికల్లో కూడా అంతే సపోర్ట్ ఇస్తారా? అంటే చెప్పడం కష్టమే అనే చెప్పొచ్చు..ఎందుకంటే ఈ సారి ఇతర జిల్లాలతో కడప జిల్లా ప్రజల్ మైండ్ సెట్ కూడా మారుతుంది.

ఈ రెండున్నర ఏళ్లలో కడప జిల్లాకు కొత్తగా ఒరిగింది ఏమి కనబడటం లేదు…జగన్ సొంత జిల్లా అయినా సరే జిల్లాలో జరిగిన అభివృద్ధి శూన్యం..ఏదో పథకాలు మాత్రం అందుతున్నాయి తప్ప..జిల్లాలో అభివృద్ధి చాలా తక్కువ…ఇటు ఎమ్మెల్యేలు ఎవరి పని వారు చూసుకుంటున్నారు తప్ప, ప్రజల పనులు పట్టించుకోవడంలో కాస్త వెనుకబడ్డారు. ఈ పరిస్తితుల నేపథ్యంలో కడప జిల్లా ప్రజలు వైసీపీకి ఓటు విషయంలో కాస్త ఆలోచించవచ్చు.

ఇదే క్రమంలో ప్రొద్దుటూరు రాజకీయాలు కూడా మారే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది..ఇప్పటికే కడపలో పలు నియోజకవర్గాల్లో మార్పు కనిపిస్తోంది. ఇక ప్రొద్దుటూరులో కూడా కాస్త పరిస్తితులు మారుతున్నాయి..ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ కాంగ్రెస్, వైసీపీలే ఎక్కువ పాగా వేస్తున్నాయి. ఏదో 1985లో ఒకసారి, 2009లో ఒకసారి మాత్రమే ప్రొద్దుటూరులో టీడీపీ గెలిచింది…అంతే ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలవగా, గత రెండు ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది. 2014లో అంటే వైసీపీ అధికారంలో లేదు కాబట్టి పెద్దగా పనులు జరగలేదని అనుకోవచ్చు.

కానీ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది..అయినా సరే ప్రొద్దుటూరు ప్రజలకు ఒరింగింది ఏమి లేదు. దీంతో ప్రొద్దుటూరు ప్రజలు ఈ సారి ఆలోచనలో పడేలా ఉన్నారు..మళ్ళీ వైసీపీ వైపు మొగ్గు చూపడం వల్ల ప్రయోజనం లేదని వారు ఆలోచిస్తే…ఇంకా ప్రొద్దుటూరులో వైసీపీకి గెలిచే ఛాన్స్ ఉండదు…అంటే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ రాదు. మరి చూడాలి ఈ సారి ప్రొద్దుటూరు ప్రజలు ఎటువైపు ఉంటారో.

Discussion about this post