రాజకీయాల్లో నేతలకు ఒకోసారి ప్రత్యర్ధుల వల్ల ఓటమి ఎదురు కాకపోవచ్చు…కానీ సొంత పార్టీ నేతల వల్ల ఓటమి రావొచ్చు. అంటే సొంత పార్టీలో ఉండే నాయకులే…తమ లీడర్‌పై అసంతృప్తిగా ఉండి వ్యతిరేకంగా పనిచేయవచ్చు. దాని వల్ల పార్టీకే డ్యామేజ్ జరుగుతుంది. గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి అదే పరిస్తితి ఎదురైంది. కొన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు పెరిగి..ఓటమి వరకు వచ్చింది.

ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీలో కూడా అదే పరిస్తితి కనిపిస్తోంది. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంది. దీని వల్ల నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు షాక్‌లు తగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా ఫస్ట్ షాక్ దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కే తగిలేలా ఉంది. మొదట నుంచి దర్శి వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. దాని వల్లే ఇటీవల దర్శి మున్సిపాలిటీలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. మరి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా దర్శిలో వైసీపీకి డ్యామేజ్ అయ్యేలా ఉంది.

ఇక చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజినితో మర్రి రాజశేఖర్ వర్గానికి పడని విషయం తెలిసిందే. అటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల వర్గంతో కూడా రజినికి పోరు ఉంది. ఈ పోరు నెక్స్ట్ ఎన్నికల్లో రజినికి మైనస్ అయ్యేలా ఉంది. ఇటు నగరిలో రోజాకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. డైరక్ట్‌గానే రోజాపై విమర్శలు చేస్తున్నారు. నెక్స్ట్ గానీ రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తే నగరిలో వైసీపీ పరిస్తితి ఏం అవుతుందో ఊహించుకోవచ్చు.

ఇక కర్నూలు సిటీలో వైసీపీ నేతల మధ్య రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలకు పెద్దగా పడటం లేదనే సంగతి తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో ఒకరికి సీటు దొరికితే మరొకరి వర్గం సహకరించే పరిస్తితి కనిపించడం లేదు. దీంతో కర్నూలు సిటీలో వైసీపీకి డ్యామేజ్ జరిగేలా ఉంది.

Discussion about this post