ఏపీలో జనసేనకు పెద్దగా బలం లేదనే సంగతి తెలిసిందే. అయితే బలం లేకపోయినా సరే పవన్‌కు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు భయపడే పరిస్తితి ఉంది. ఆయన వల్ల ఎమ్మెల్యేల గెలుపోటములు తారుమారయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాకపోతే పవన్, టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే వైసీపీ ఎమ్మెల్యేలకు టెన్షన్ ఉంటుంది…లేదంటే అంత టెన్షన్ ఉండదు. పొత్తు లేకపోతే ఆ వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంకా ప్లస్ అవుతుంది. గత ఎన్నికల్లో అలాగే జరిగింది.

పవన్ విడిగా పోటీ చేయడం వల్ల టీడీపీ ఓట్లు చీల్చేయడం వల్ల వైసీపీకి ప్లస్ అయింది. అలా చాలామంది వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచేశారు. ఇప్పుడు వారే పవన్ వల్ల టెన్షన్ పడుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో గానీ…పవన్, టీడీపీతో కలిస్తే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లోకి వచ్చినట్లే. ముఖ్యంగా వెస్ట్ గోదావరి వైసీపీ ఎమ్మెల్యేలకు పవన్ వల్ల బాగా టెన్షన్ ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ ఓట్లు చీల్చడం వల్లే వెస్ట్‌లో వైసీపీ 13 సీట్లు గెలుచుకుంది.

కానీ ఈ సారి మాత్రం ఆ సీన్ వచ్చేలా లేదు. టీడీపీ-జనసేనలు కలిస్తే సగం వైసీపీ ఎమ్మెల్యేల పరిస్తితి అస్సామే. అలా రెండు పార్టీలు పొత్తు ఉంటే నష్టపోయే ఎమ్మెల్యేల్లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబులు డేంజర్ జోన్‌లోకి వచ్చినట్లే.

అలాగే ముగ్గురు మంత్రులు ఆళ్ళ నాని, తానేటి వనిత, చెరుకువాడ రంగనాథరాజులకు సైతం కష్టాలు తప్పవు. ఎందుకంటే గత ఎన్నికల్లో వీరు టీడీపీ మీద సాధించిన మెజారిటీ కంటే…ఆయా నియోజకవర్గాల్లో జనసేనకు పడిన ఓట్లే ఎక్కువ. కాబట్టి పవన్ వల్ల ఈ ఎమ్మెల్యేలకు నెక్స్ట్ టెన్షన్ తప్పదనే చెప్పాలి.

Discussion about this post