ఏపీలో గెలుపు దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఓటమికి రివెంజ్ తీర్చుకుని వైసీపీకి చెక్ పెట్టి అధికారం సొంతం చేసుకోవాలని టిడిపి చూస్తుంది. ఈ క్రమంలోనే అన్నీ స్థానాల్లో తమ పట్టు పెంచుకునే దిశగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలు సీట్లలో టిడిపికి లీడ్ వచ్చింది. జనసేనతో పొత్తు ఇంకా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో టిడిపి భారీ లీడ్ లో ఉన్న ప్రాంతం బాపట్ల అని చెప్పవచ్చు. బాపట్ల పార్లమెంట్ పరిధిలో టిడిపికి ఊహించని పట్టు ఉంది.

గత ఎన్నికల్లోనే నాలుగు సీట్లని టిడిపి గెలుచుకుంది. బాపట్ల పార్లమెంట్ పరిధిలో అద్దంకి, రేపల్లె, పర్చూరు, చీరాల సీట్లు టిడిపి గెలుచుకుంది. సంతనూతలపాడు, వేమూరు, బాపట్ల సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు మిగిలిన సీట్లలో కూడా టిడిపి లీడ్ లోకి వచ్చింది. ఎలాగో సిట్టింగ్ సీట్లు అద్దంకి, పర్చూరు, రేపల్లెలో టిడిపికి ఆధిక్యం ఉంది. ఇక చీరాల నుంచి గెలిచిన కరణం బలరామ్ వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ కాస్త పట్టు తగ్గింది. ఎంఎం కొండయ్య ఇంచార్జ్ గా ఉన్నారు. కానీ ఆ సీటులో జనసేనకు పట్టు ఉంది. దీంతో పొత్తులో భాగంగా ఈ సీటు కూడా కైవసం చేసుకోవచ్చు.

అలాగే వేమూరు, బాపట్ల, సంతనూతలపాడులో లీడ్ పెరిగింది. ఇక అభ్యర్ధులు కూడా ఫిక్స్ అయిపోయారు. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పర్చూరులో ఏలూరి సాంబశివరావు, రేపల్లెలో అనగాని సత్యప్రసాద్, సంతనూతలపాడులో బిఎన్ విజయ్ కుమార్, వేమూరులో నక్కా ఆనంద్ బాబు, బాపట్లలో వేగేశన నరేంద్ర వర్మ పోటీ చేయడం ఖాయమే. చీరాలలో క్లారిటీ లేదు. ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు దక్కే ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికి బాపట్లలో టిడిపికి భారీ లీడ్ ఉంది.