ఎంత కాదు అనుకున్న వైసీపీలో రెడ్డి వర్గం..టీడీపీలో కమ్మ వర్గం నేతల హవా ఎక్కువ ఉంటుంది..ఇందులో ఎలాంటి అనుమానం లేదు..అయితే ఈ వర్గాలే రాజకీయంగా ఆ పార్టీలని నిలబెడుతున్నాయని చెప్పొచ్చు..కాకపోతే గత ఎన్నికల్లో కమ్మ వర్గం నేతలు విఫలమవ్వడంతోనే టీడీపీకి ఎక్కువ డ్యామేజ్ జరిగింది. కమ్మ నేతలు ఎక్కడకక్కడ ఓటమి పాలవ్వడంతో..టీడీపీ కూడా దారుణంగా ఓడిపోయి అధికారానికి దూరమైంది.

అయితే ఈ సారి మాత్రం తాము సత్తా చాటడంతో పాటు పార్టీని కూడా అధికారంలోకి తీసుకురావాలని టీడీపీ కమ్మ నేతలు ప్రయత్నిస్తున్నారు..ఎందుకంటే మరొకసారి వైసీపీని గాని అధికారంలోకి వస్తే పరిస్తితి ఎలా ఉంటుందో కమ్మ నేతలకు బాగా తెలుసు…ఇప్పటికే వైసీపీ అధికారంలో ఉండటంతో రాజకీయంగా, ఆర్ధికంగా కమ్మ నేతలు బాగా నష్టపోయారు..మళ్ళీ ఇంకోసారి జగన్ అధికారంలోకి వస్తే అంతే సంగతులు. ఆ విషయం అర్ధం చేసుకుని టీడీపీలో ఉన్న కమ్మ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు…తాము బలపడటంతో పాటు, పార్టీని కూడా బలోపేతం చేస్తున్నారు.

ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కమ్మ నేతలు బాగా దూకుడుగా ఉన్నారు..ఎన్నికల్లో ఓడిపోయాక కొన్ని రోజులు సైలెంట్‌గానే ఉన్నారు గాని..ఆ తర్వాత వైసీపీ నుంచి ఇబ్బందులు ఎదురు అవ్వడంతో కమ్మ నేతలు యాక్టివ్ అయ్యారు..పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. దీంతో చాలావరకు పికప్ అయ్యారు. గుంటూరు జిల్లాలోని కమ్మ నేతల బలం కూడా పెరిగిందని చెప్పొచ్చు.

పొన్నూరులో ధూళిపాళ్ళ నరేంద్ర, మంగళగిరిలో నారా లోకేష్, తెనాలిలో ఆలపాటి రాజా, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండలో జీవీ ఆంజనేయులు, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్‌లు దూకుడుగా పనిచేస్తున్నారు. అటు సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం సైతం యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఇటు గుంటూరు వెస్ట్‌లో కోవెలమూడి రవీంద్ర సైతం దూకుడుగా ఉన్నారు. మొత్తానికి గుంటూరు జిల్లాలో కమ్మ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు…మరి వచ్చే ఎన్నికల్లో ఈ కమ్మ నేతలు సత్తా చాటేలా ఉన్నారు.








Discussion about this post