రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు వైసీపీ హవా ఉన్నట్లు కనిపించినా …ఇప్పుడు పూర్తిగా సీన్ మారుతూ ఉంది. టీడీపీ కూడా వేగంగా పికప్ అవుతుంది. వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉండటం కావొచ్చు..టీడీపీ నేతలు పుంజుకోవడం కావొచ్చు..కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం కావొచ్చు…ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.

ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీకి యాంటీ మొదలైంది. దాదాపు చాలా జిల్లాల్లో వైసీపీతో టీడీపీ ఢీ అంటే ఢీ అనే పరిస్తితికి వచ్చింది. పలు జిల్లాల్లో వైసీపీకి బాగానే డ్యామేజ్ జరిగినట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో పలు జిల్లాల్లో వైసీపీకి సగం సీట్లలో డ్యామేజ్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా ప్రతి జిల్లాల్లోనూ వైసీపీ హవా నడిచింది. కానీ ఇప్పుడు నిదానంగా సీన్ మారుతూ వస్తుంది.

శ్రీకాకుళంలో 10 సీట్లు ఉంటే అందులో 8 సీట్లు వైసీపీకే ఉన్నాయి…ఈ 8లో సగం మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకతని ఎదురుకుంటున్నట్లు కనిపిస్తోంది. అలాగే విశాఖపట్నంలో 15 సీట్లు ఉంటే అందులో 11 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి చెందినవారే. ఒక టీడీపీ ఎమ్మెల్యేని కూడా కలుపుకుంటే 12 మంది. ఈ 12లో సగం మందిపై వ్యతిరేకత కనిపిస్తోంది. తూర్పులో 19 సీట్లు ఉంటే 15 వైసీపీకే ఉన్నాయి. ఇందులో సగం మంది పరిస్తితి దారుణంగానే ఉంది.

ఇక పశ్చిమ గోదావరిలో 15 సీట్లు ఉంటే 13 వైసీపీకే ఉన్నాయి…ఇక్కడ కూడా వైసీపీకి సగం డ్యామేజ్ కనిపిస్తోంది. కృష్ణాలో 16 సీట్లలో 15 వైసీపీకే ఉన్నాయి. అలాగే గుంటూరులో 17 సీట్లకు 16 వైసీపీకే ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి సగంపైనే డ్యామేజ్ కనిపిస్తోంది. ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కూడా వైసీపీది అదే పరిస్తితి. ఇక నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, విజయనగరం జిల్లాలో వైసీపీ హవా ఇంకా ఉంది.

Discussion about this post