శ్రీకాకుళం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే…జిల్లాలో మొదట నుంచి టీడీపీ హవా నడుస్తోంది. జిల్లాలో ఉన్న పలు స్థానాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. అయితే జిల్లాలో దాదాపు అన్నీ స్థానాల్లో టీడీపీకి పట్టు ఉంది. కాకపోతే ఒక పాలకొండలో మాత్రం టీడీపీకి పెద్దగా పట్టు లేదని చెప్పొచ్చు. మొదట్లో ఇక్కడ టీడీపీ మంచి విజయాలు సాధించింది. 1983, 1985, 1994, 2004 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. అప్పటినుంచి మళ్ళీ పాలకొండలో టీడీపీ జెండా ఎగరలేదు.

కానీ ఈ సారి మాత్రం పాలకొండలో టీడీపీ జెండా ఎగిరేలా ఉంది…ఎందుకంటే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కళావతికి హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ అయ్యేలా ఉంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచేశారు. 2014లో అధికారంలో లేకపోయిన కళావతి మాత్రం వైసీపీని వీడలేదు. దీంతో ఆమె మళ్ళీ సత్తా చాటగలిగారు. కానీ ఈ సారి అధికారం ఉంది. అయినా సరే పాలకొండలో చేసేది ఏమి లేదు. ఈ రెండున్నర ఏళ్లలో పాలకొండలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా జరగలేదు.

ఇంకా ఎమ్మెల్యే కూడా ప్రజలకు అందుబాటులో ఉండేది కూడా తక్కువే అని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేపై ప్రజా వ్యతిరేకత బాగానే పెరిగింది…ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో కూడా పాలకొండలో మళ్ళీ వైసీపీ గెలవడం కష్టమే అని కథనాలు వస్తున్నాయి. దీని బట్టి చూస్తే పాలకొండలో కళావతికి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

అదే సమయంలో అటు టీడీపీ తరుపున నిమ్మక జయకృష్ణ యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. గత రెండు పర్యాయాలు నుంచి ఈయనే టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోతున్నారు. వరుసగా ఓడిపోతున్న సానుభూతి ఉంది. అటు ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది. ఈ పరిస్తితులని బట్టి చూస్తే…ఈ సారి పాలకొండలో వైసీపీ హ్యాట్రిక్ సాధించడం కష్టమే అని చెప్పొచ్చు.

Discussion about this post