నెల్లూరు జిల్లా ఆత్మకూరు…అసలు తెలుగుదేశం పార్టీకి కలిసిరాని నియోజకవర్గం. మొదట నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌దే హవా…ఇప్పుడు వైసీపీ హవా నడుస్తుంది. అంతే గానీ ఇక్కడ టీడీపీ పెద్ద ప్రభావం మాత్రం చూపలేదు. ఏదో పార్టీ పెట్టినప్పుడు 1983లో ఒకసారి పార్టీ గెలవగా, మళ్ళీ 1994లో ఒకసారి గెలిచింది. ఇక అంతే మళ్ళీ ఆత్మకూరులో టీడీపీ జెండా ఎగరలేదు. అసలు అప్పటినుంచి నియోజకవర్గంలో టీడీపీని నడిపించే నాయకుడు లేడు.

ఎన్నిక ఎన్నికకు అభ్యర్ధులు మారుతున్నారు గానీ, టీడీపీ తలరాత మారడం లేదు. సారైనా నాయకుడు లేకపోవడం వల్ల అసలు ఆత్మకూరులో టీడీపీ ఉందా అనే డౌట్ వస్తుంది. ఇంతవరకు మళ్ళీ గెలవని టీడీపీ…రాబోయే ఎన్నికల్లో కూడా గెలవడం కూడా కష్టమే అన్నట్లు పరిస్తితి ఉంది. ఎందుకంటే ఇది యువ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అడ్డాగా మారిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో ఆయనే వరుసగా ఆత్మకూరులో విజయం సాధించారు.

ఇప్పుడు జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో కూడా ఆత్మకూరులో టీడీపీ సునామీనే. అసలు ప్రభావం చూపలేకపోయింది. అయితే టీడీపీకి ఇంత దరిద్రమైన పరిస్తితి ఉంది కదా….వైసీపీ అదిరిపోయేలా పనులు చేస్తుందా? అంటే అది లేదనే చెప్పాలి. ఏదో మంత్రిగా ఉన్న గౌతంరెడ్డి కొంతవరకు పనిచేయగలుగుతున్నారు. పూర్తిగా అయితే ఆత్మకూరుని అభివృద్ధి చేయలేకపోతున్నారు.

పైగా ఇక్కడ వైసీపీపై ప్రజా వ్యతిరేకత కూడా పెరిగినట్లు ఇటీవల పలు సర్వేలు చెప్పాయి. సరే వైసీపీపై వ్యతిరేకత ఉంటే…అదేమన్న టీడీపీకి కలిసొచ్చే ఛాన్స్ లేదు. అసలు ఇక్కడ టీడీపీకే దిక్కులేదు. అయితే ఇప్పటినుంచైనా కాస్త ఎఫెక్టివ్ గా పనిచేస్తే ఫలితం ఏమన్నా ఉంటుంది. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన బొల్లినేని కృష్ణయ్య పార్టీలో యాక్టివ్ గా లేరు. దీని వల్ల పార్టీ ఇంకా నష్టపోతుంది. ఇకనైనా చంద్రబాబు…ఆత్మకూరుపై ఫోకస్ పెట్టి పార్టీని బలోపేతం చేస్తే బెటర్…లేదంటే ఇక్కడ టీడీపీ గెలుపు శాశ్వతంగా మరిచిపోవాలి.

Discussion about this post