ఎక్కడైనా మంత్రులు పవర్‌ఫుల్‌గా ఉంటారు…కానీ ఏపీలో మంత్రులు పవర్ నిల్ అని చెప్పి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో పేరుకే మంత్రులు ఉన్నారు గాని..పెత్తనమంతా సజ్జల రామకృష్ణారెడ్డిదే అనే టాక్ ఉంది. టాక్ ఉండటం ఏముంది…ఇదే నిజమని ప్రజలు అనుకుంటున్నారు..అలాగే వైసీపీ నేతలు అనుకుంటున్నారు. అసలు మంత్రులు సంతకాలకు, ప్రతిపక్షాలని తిట్టడానికి తప్పితే…ప్రజలకు సేవ చేయడానికి ఉన్నట్లు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

అసలు కొందరు మంత్రులు ఏ శాఖ నిర్వహిస్తున్నారో కూడా ప్రజలకు తెలియదని, ఇంకా చెప్పాలంటే కొందరు మంత్రులు అనే సంగతే తెలియదని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. పైగా కొందరు మంత్రులు ఎప్పుడు వివాదాల్లో తప్ప మరి ఏ పనిలో ఉండటం లేదని అంటున్నారు. ఇలా ఎప్పుడు ఏదొక వివాదాల్లో ఉండేవాళ్ళల్లో మంత్రి గుమ్మనూరు జయరాం ముందున్నారని అంటున్నారు. అసలు జయరాం మంత్రి అయిన దగ్గర నుంచి ఏదొక వివాదంలో ఉంటూనే ఉన్నారు.

ఆ మధ్య బెంజ్ కారు లంచం తీసుకున్నారని, భూ కబ్జాలు చేశారని, తన నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నిర్వహించారని, అలాగే ఇసుక, ఇళ్ల స్థలాల్లో మంత్రుల అనుచరులు లెక్కలేని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణలు వచ్చాకే జయరాం కాస్త సైలెంట్ అయ్యారు. ఈ మధ్య ఆయన పెద్దగా మీడియాలో కనిపించడం లేదు.

అయితే తాజాగా మంత్రి సొంత నియోజకవర్గం ఆలూరులోని ప్రజలు మంత్రి పనితీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు అన్నీ చేసేస్తామని హామీలు ఇచ్చారని, కానీ ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యాక ఒక్క మంచి పని కూడా చేయడం లేదని ప్రజలు సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇలా అన్నిరకాలుగా మంత్రి జయరాంపై నెగిటివ్ వస్తుంది. ఇక నెక్స్ట్ ఈయన మంత్రి పదవి ఊడటం ఖాయమని ప్రచారం జరుగుతుంది..అలాగే నెక్స్ట్ ఆలూరు బరిలో గెలవడం కూడా కష్టమే అని తెలుస్తోంది. అంటే రెండు విధాలుగా జయరాంకు నష్టం జరిగేలా ఉంది.

Discussion about this post