ఏపీలో పలువురు మంత్రులపై వ్యతిరేకత ఉందని..ఈ మధ్య వైసీపే అంతర్గత సర్వేల్లో కూడా తేలిన విషయం తెలిసిందే. ఆ మధ్య జరిగిన వైసీపీ వర్క్ షాపులో జగన్..పనితీరు మెరుగు పర్చుకోవాలని కొందరు మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొత్తగా మంత్రులైన వారు..ప్రజా వ్యతిరేకతని ఎక్కువ మూటగట్టుకుంటున్నట్లు సర్వేల్లో తేలుతుంది.

ఎందుకంటే వారు మంత్రులుగా ఉన్నారు గాని..ఆ మంత్రి పదవికి తగ్గట్టుగా పనులు మాత్రం చేయడం లేదు..కేవలం ప్రతిపక్ష నేతలని విమర్శించడానికి, జగన్‌కు భజన చేయడానికి మంత్రులుగా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. విచిత్రమైన విషయం ఏంటంటే..కొందరు మంత్రులనే సంగతి ప్రజలకే అవగాహన లేకపోవడం..అంటే మంత్రుల పనితీరు అలా ఉంది. ఇదే క్రమంలో మంత్రి మేరుగు నాగార్జున పనితీరు కూడా అంతంత మాత్రమే ఉందని సర్వేల్లో తేలినట్లు తెలుస్తోంది. మంత్రిగా పక్కన పెడితే..సొంత స్థానం వేమూరులో మంత్రి వ్యతిరేకత తెచ్చుకున్నారని ఇటీవల శ్రీ ఆత్మసాక్షి సర్వేలో వెల్లడైంది.

టీడీపీ కంచుకోటగా ఉన్న వేమూరులో గత ఎన్నికల్లో టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబుపై..మేరుగు నాగార్జున గెలిచారు. అయితే ఈయన అనుకున్న విధంగా నియోజకవర్గంలో పనులు చేయడం, సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. పైగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇసుకలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి.

ఇవన్నీ మంత్రికి నెగిటివ్ అవుతున్నాయి. ఇక ఇటీవల వచ్చిన సర్వేలో మంత్రి పని తీరు పట్ల ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోందని, ప్రస్తుతం వైసీపీ కంటే 2.75శాతం ఓటు షేరుతో తెలుగుదేశం ఆధిక్యత కనబరుస్తోందని సర్వేలో తేలింది. అంటే వేమూరులో టీడీపీ గెలుపుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి.

Leave feedback about this