ఎవరు చేసుకున్నది వారు అనుభవిస్తారనేది.. రాజకీయాల్లోనూ కనిపిస్తోంది. వినిపిస్తోంది. ప్రజలకు దూ రం కావడం.. వివాదాస్పద విషయాల్లో పాత్ర ఉందని ఆరోపణలు రావడం.. ఎంత సేపూ.. సొంత విషయా లకు.. ప్రాధాన్యం ఇవ్వడం వంటివి వైసీపీలోని చాలా మంది నేతలకు ఇబ్బందిగా మారాయి. పైకి వారు అంతా బాగుందని.. ఆల్ ఈజ్ వెల్ అని చెబుతున్నా.. లోలోన మాత్రం తీవ్రస్థాయిలో వారు మథన పడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి వారి జాబితాలో ఏకంగా.. కడప ఎంపీనే చేరిపోయారు.

వైఎస్ కుటుంబానికి పట్టుకొమ్మ వంటి కడప జిల్లాలో ఇదే కుటుంబానికి బంధువు కూడా అయిన.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకత ఓ రేంజ్‌లో కొనసాగుతుండడం గమనార్హం. ఇది.. నిజం కాదేమో.. ప్రతిపక్ష నేతల కుట్రేమో.. అని చాలా మంది వైసీపీ నాయకులు భావించారు. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థి తి ని గమనించిన తర్వాత.. వాస్తవం అందరి కళ్లకూ కట్టినట్టు కనిపించింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. అసలు ఏం జరిగిందని ఆరా తీశారు.

విషయం ఏంటంటే.. తాజాగా ఏపీ సర్కారు ప్రారంభించిన `గడప గడపకు మన ప్రభుత్వం` కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తన పార్లమెంటు పరిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సింహాద్రిపురం మండలం, అహోబి లం, రావులకొలను, సుంకేసుల గ్రామాలలో పర్యటించారు. అయితే.. వాస్తవానికి ఎంపీ స్థాయి నాయకుడు వస్తే.. మందీ మార్బలం అదిరిపోయే రేంజ్‌లో రావాలి కదా! కానీ, రాలేదు.

అంతేకాదు.. ప్రజల నుంచి కూడా ఎక్కడా రెస్పాన్స్ లేదు. కొన్నిచోట్ల అయితే.. ఎంపీ వస్తున్నారని తెలి సి.. ప్రజల ఇళ్లకు తాళాలు వేసి మరీ వెళ్లిపోయారు. మరికొన్ని చోట్ల ప్రజలు ఆయనను పెద్దగా పట్టించుకో లేదు. దీంతో ఎంపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ కార్యక్రమం ఫెయిల్ అయింది. అయితే.. ఆయనపై వైఎస్ వివేకా హత్యకు సంబంధించి ఆరోపణలు ఉండడంతో ప్రజల్లో ఆయనపై ఇమేజ్ తగ్గిపోయిందని.. అందుకే జనాలు వచ్చి ఉండరని.. ప్రతిపక్ష నాయకులు సహా.. అధికార పార్టీ నేతలు.. కూడా గుసగుసలాడడం గమనార్హం.

Discussion about this post