ఏపీలో కుటుంబ రాజకీయాలకు ఎలాంటి కొదవ లేదనే చెప్పాలి…ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు నేతలు రాజకీయాలు చేసేవారు ఉన్నారు. అయితే వారు ఒకే పార్టీ నుంచి రాజకీయం చేయొచ్చు…లేదా వేరే పార్టీ నుంచి రాజకీయం చేయొచ్చు. అయితే ఏపీలో ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా పనిచేయడం చాలా అరుదు అని చెప్పొచ్చు. ఇక అలాంటి అరుదైన ఘనత కర్నూలు జిల్లాలో యెల్లారెడ్డి ఫ్యామిలీకి దక్కింది.

ఈ ఫ్యామిలీ నుంచి ముగ్గురు నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. గత ఎన్నికల్లో ముగ్గురు వైసీపీ తరుపున పోటీ చేసి భారీ మెజారిటీలతో ఎమ్మెల్యేలు అయ్యారు. అలా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరో కాదు…వై. బాలనాగిరెడ్డి, వై. సాయిప్రసాద్ రెడ్డి, వై.వెంకట్రామి రెడ్డి. ఇక ఇందులో బాలనాగిరెడ్డి…మంత్రాలయం నుంచి, సాయిప్రసాద్…ఆదోని నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వెంకట్రామిరెడ్డి మాత్రం అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి పోటీ చేసి గెలిచారు.

ఇలా ముగ్గురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా గెలిచారు….మరి ఎమ్మెల్యేలుగా ఎలాంటి పనితీరు కనబరుస్తున్నారు…నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ముగ్గురుకు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం ఒక్కసారి గమనిస్తే… ఎమ్మెల్యేలుగా ముగ్గురు తమదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. అయితే ప్రజలు ఆశలు పెట్టుకున్న విధంగా వీరి పనితీరు లేదని తెలుస్తోంది. ప్రభుత్వం తరుపున సంక్షేమ కార్యక్రమాలే వీరికి అతి పెద్ద ప్లస్ పాయింట్. ఇంకా చెప్పుకోదగిన ప్లస్ పాయింట్స్ కనబడటం లేదు.


పైగా వీరిలో బాలనాగిరెడ్డి, వెంకట్రామిరెడ్డిలపై ప్రజా వ్యతిరేకత కాస్త పెరిగిందని సర్వేలు వస్తున్నాయి. మంత్రాలయం, గుంతకల్లు నియోజకవర్గాల్లో టీడీపీ కూడా పికప్ అవుతున్నట్లు తెలుస్తోంది. మంత్రాలయంలో తిక్కారెడ్డి, గుంతకల్లులో జితేంద్ర గౌడ్‌లు దూకుడుగానే ఉన్నారు. ఆదోనిలో టీడీపీ నేత మీనాక్షి నాయుడు కాస్త పికప్ అవ్వాల్సిన అవసరముంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఈ మూడు చోట్ల టీడీపీ ఇంకా పికప్ అయితే…ముగ్గురు అన్నదమ్ములకు ఇబ్బంది అవుతుంది…అలా లేదంటే మళ్ళీ ముగ్గురుకు మంచి ఛాన్స్ వస్తుంది.

Discussion about this post