మొత్తానికి వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు బయటపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి..ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలని వైసీపీ సస్పెండ్ చేసింది. ఇక సస్పెండ్ చేశాక ఎమ్మెల్యేలు రిలాక్స్ అయ్యారు. అలా సస్పెండ్ చేయడమే తమకు మంచిదని అంటున్నారు. సస్పెండ్ చేయడం వల్ల ఆ ఎమ్మెల్యేలకు పోయేదేమీ లేదు.
సస్పెండ్ అయ్యాక మరింత ఫ్రీ అయ్యారు. ఇలా వైసీపీ నుంచి బయటకొచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరతారా? అంటే ఇప్పటికిప్పుడు చేరే ఛాన్స్ లేదు గాని..ఎన్నికల సమయంలో మాత్రం ఖచ్చితంగా చేరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టిడిపిలో చేరారు. అటు ఆనం కుమార్తె కైవల్య ఎప్పుడో టిడిపిలో చేరారు. ఇక వీరు టిడిపిలో చేరడం ఖాయమే. ఇక ఆనం, కోటంరెడ్డిలకు సీట్లు కూడా ఫిక్స్ అని చెప్పవచ్చు.

కోటంరెడ్డి మళ్ళీ నెల్లూరు రూరల్ సీటులో పోటీ చేయడం ఖాయం. అటు ఆనం..నెల్లూరు సిటీ లేదా ఆత్మకూరులో పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక మేకపాటి, శ్రీదేవిలని టిడిపిలోకి తీసుకుంటారా? దానిపై క్లారిటీ రాలేదు. పైగా వారిపై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. అందుకే వారికి జగన్ సీటు ఇవ్వనని చెప్పేశారు. ఇప్పుడు టిడిపిలోకి వస్తే సీట్లు దక్కుతాయా అనేది నో క్లారిటీ.ఒకవేళ సీట్లు ఇవ్వాలని అనుకుంటే ఇప్పుడు వారు ప్రాతినిధ్యం వహించే సీట్లు ఇవ్వరనే చెప్పవచ్చు. అదే సమయంలో శ్రీదేవికి తాడికొండ కాకుండా బాపట్ల ఎంపీ సీటు..మేకపాటికి నెల్లూరు ఎంపీ సీటు గాని ఇస్తారేమో చూడాల్సి ఉంది.