కుప్పం అంటే టీడీపీ కంచుకోట…1983 నుంచి 2019 వరకు ఒక్కసారిగా ఓడిపోలేదు..ఇక ఇది 1989 నుంచి చంద్రబాబు అడ్డాగా మారింది. అప్పటినుంచి అక్కడ బాబు గెలుస్తూ వస్తున్నారు. భారీ మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కాస్త మెజారిటీ తగ్గింది. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పం టార్గెట్ గా ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. కుప్పంలో అధికార బలాన్ని ఉపయోగించి..అక్కడ ప్రజలని భయపెట్టి వైసీపీ వైపుకు తిప్పుకుని…పంచాయితీ ఎన్నికల్లో గెలిచారు..స్థానిక ఎన్నికల్లో గెలిచారు. కుప్పం మున్సిపాలిటీలో గెలిచారు.
ఇక కుప్పం అసెంబ్లీలో కూడా తమదే గెలుపు అని, చంద్రబాబుని ఓడిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే నిజంగా ప్రజా మద్ధతుతో గెలిస్తే అనుకోవచ్చు. కానీ వైసీపీ గెలిచింది అధికార బలంతో..ఆ బలం అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయదు…మళ్ళీ ప్రజలు బాబు వైపే ఉంటారు..అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇప్పటికే బాబు రాష్ట్రంలో పర్యటిస్తూనే..కుప్పంలో తన బలం తగ్గకుండా చూసుకుంటున్నారు.

అయితే ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో బాబు రాష్ట్ర పర్యటనలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో కుప్పంపై సరిగా ఫోకస్ చేయలేరు. ఈ నేపథ్యంలోనే కుప్పం బాధ్యతలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ఇటీవల తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన శ్రీకాంత్‌ని కుప్పం పంపించారు. అలాగే అక్కడ శ్రీకాంత్ ప్రోటోకాల్ కూడా పొందారు. అలాగే ఎక్స్‌అఫిషియో మెంబర్ అయ్యారు. దీంతో కుప్పం మున్సిపల్ సమావేశాల్లో కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది.
మొత్తం మీద కుప్పంలో బాబు బలం తగ్గకుండా ఉండటమే లక్ష్యంగా శ్రీకాంత్ పనిచేయనున్నారు. ఈసారి వైసీపీ దిమ్మతిరిగేలా బాబుకు లక్ష మెజారిటీ తెచ్చేలా ముందుకెళ్లనున్నారు. మొత్తానికి కుప్పంలో బాబు మళ్ళీ అదిరే మెజారిటీతో గెలవనున్నారు.