రాజకీయాల్లో జనంలో నెగిటివ్ అయిపోతున్నామనుకునే సమయంలో నాయకులు ఎక్కువగా ప్రత్యర్ధులపై ఎదురుదాడి చేయడంపై ఎక్కువ ఫోకస్ చేస్తారు…ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ అదే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది..వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అవుతుంది..మరి ఈ రెండున్నరఏళ్లలో ఏం చేశారో అందరికీ తెలిసిందే. జగన్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో కూడా బాగా క్లారిటీ ఉందనే చెప్పాలి. అలాగే ప్రతిపక్ష టీడీపీని ఎన్ని రకాలుగా చూపిస్తున్నారో చెప్పాల్సిన పని లేదు.

పైగా ఎలా వైసీపీ తీరు ఎలా ఉంటుందంటే….మొగుడిని కొట్టి మొగసాలికి ఎక్కినట్లే ఉంటుంది. అంటే వైసీపీనే బూతులు తిట్టేది, దాడులు చేసేది…కానీ రివర్స్‌లో టీడీపీని అనడం, పైగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టడం, జైలుకు పంపించడం కామన్ అయిపోయింది. ఇక ఇటీవల ఎలాంటి ఘటనలు జరిగాయో చెప్పాల్సిన పని లేదు. వీటి అన్నిటిపై చంద్రబాబు ఒక్క పాయింట్‌తో తేల్చేశారు…తాజాగా కుప్పం పర్యటనకు వెళ్ళిన బాబు….జగన్‌కు ఒకే ఒక సవాల్ విసిరారు.మిస్టర్ జగన్.. ఈ రెండున్నరేళ్లలో ఎవరు ఎవరిని ఎక్కువగా తిట్టారో తేలుద్దాం… పులివెందుల, కుప్పం, తిరుపతి, విజయవాడ.. లేదా జెరూసలేం.. ఎక్కడికైనా రా.. ఎవరు ఎవరిని తిడుతున్నారో.. ప్రజల ముందు ఉంచుదామని సవాల్ చేశారు. ఈ ఒక్క సవాల్ చాలు…ఎవరు ఏంటి అనేది ప్రజలకు బాగా క్లారిటీ రావడానికి అని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అయినా సరే ప్రజలకు బాగా క్లారిటీ ఉందని… ఎవరు బూతులు మాట్లాడుతున్నారు…ఎవరు దాడులు చేస్తున్నారు…ఎవరు కేసులు పెడుతున్నారు అనేది అంతా క్లియర్‌గానే ఉందని అంటున్నారు.

ఇక ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో కూడా చెప్పాల్సిన పని లేదని, లిక్కర్, పెట్రోల్, గ్యాస్, కరెంటు చార్జీలు, బస్సు టికెట్లు, ఇసుక.. ఇలా అన్నీ పెంచేశారని, అన్నిటికి ప్రజల దగ్గర నుంచి సమాధానం వస్తుందని, ఆ సమాధానం నెక్స్ట్ ఎన్నికల్లో గట్టిగా ఉంటుందని అంటున్నారు.
Discussion about this post