మరో ఏడాదిన్నరలో ఏపీలో ఎన్నికల వేడి రాజుకోనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమరం.. మరో ఏడాది న్నరలో తెరమీదికి రానుంది. వాస్తవానికి ముందస్తు ఎన్నికలు వస్తాయని..కొన్ని రోజులుగా వార్తలు వస్తు న్నా.. తాజాగా జగన్ 2.0 కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్న దరిమిలా .. ఈ వార్తలకు అడ్డుకట్ట వేసినట్టు అయింది. ఫలితంగా సాదారణ ఎన్నికలు 2024లోనే జరగనున్నాయి. అయితే.. ఈ ఎన్నికలు అంత ఈజీ అయితే.. కాదు.. బలంగా ఉన్న వైసీపీ మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించింది. చాలా వ్యూహాత్మకంగా సీఎం జగన్ అడుగులు వేయడం ప్రారంభించారు.
తమ ఎమ్మెల్యేలను, కార్యకర్తలను ఆయన ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ఉండాలని.. ఈ నెల చివరి నుంచి.. గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని.. వచ్చే రెండేళ్లలో ఎన్నికలకు ముందు నాటికి.. ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే కూడా మూడు సార్లు.. ప్రజలను కలవాలని.. ప్రతి ఇంటికీ వెళ్లాలని నిర్దేశించా రు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి బలమైన పోటీ వస్తుందని అంటున్నారు. ఇక, ప్రతిపక్షాల విషయానికి వస్తే.. టీడీపీ .. జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇది తమకు లాభిస్తుందని.. టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు.
అయితే.. దీనికన్నా.. ముఖ్యంగా.. ఒంటరిగా వెళ్లడమే మంచిదని.. చాలా మంది సీనియర్లు చెబుతున్నా రు. కనీసం 100 నియోజకవర్గాల్లో పార్టీ పబలంగా ప్రయత్నాలు చేస్తే.. 85 నియోజకవర్గాల్లో సునాయాసంగా గెలుపుగుర్రం ఎక్కడం ఖాయమని.. సీనియర్లు అంటున్నారు. ఇదే జరిగితే..టీడీపీపై ఇప్పటి వరకు ఉన్న అపవాదు..(పొత్తు ఉంటే తప్ప.. గెలవదు అనే..) తుడిచి పెట్టుకుపోతుందని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పొత్తు కలిసి రాకపోతే..ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సీనియర్ల నుంచి తెలుస్తోంది.
ఈ క్రమంలో ఆయన గత తన హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలను మళ్లీ ఇప్పుడు ఎన్నికల అస్త్రంగా మలుచుకుని.. ప్రజలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. దీనిలో భాగంగా పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలకు చేరువ అయిన.. అన్నా క్యాంటీన్లను మళ్లీ తీసుకువస్తామని.. ఆయన ప్రజలకు హామీ ఇవ్వనున్నారు. ఇది చాలా మెరుగైన ఫలితం ఇస్తుందని.. చంద్రబాబు భావిస్తున్నారు.
అదేవిధంగా విదేశీ విద్యా కానుక.. పథకాన్ని కూడా తిరిగి తీసుకువస్తానని ఆయన చెప్పనున్నారు. ఇది యువతను పార్టీకి చేరువ చేస్తుంది. ఇక, మరో కీలకమైన పథకం.. రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్టమస్.. కానుకలను కూడా ప్రవేశ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించడం ద్వారా ఆయా పథకాలే తమను గెలిస్తాయని అంటున్నారు సీనియర్లు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.
Discussion about this post