అసలు జగన్ ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గుతుందని ఎవరూ ఊహించలేదు. ఎలాగైనా దీనిపై ముందుకే వెళ్తారని అంతా అనుకున్నారు. కానీ అనుహ్యా పరిణామాల మధ్య మూడు రాజధానుల విషయంలో జగన్ వెనక్కి తగ్గారు. మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకున్నారు. అలా అని అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగుతుందని చెప్పలేదు..మళ్ళీ త్వరలోనే మరో బిల్లుతో ముందుకొస్తామని చెప్పారు. ఇక ఆ బిల్లులో ఏం ఉంటుంది…ఏం చేస్తారనేది తర్వాత చూడాలి.


కానీ ఇప్పుడు మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవడం వెనుక ఒక ఢిల్లీ పెద్దాయన ఉన్నారని ప్రచారం వస్తుంది. ఎలాగో అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులు, ప్రజలకు పెద్ద ఎత్తున మద్ధతు వస్తుంది. అలాగే హైకోర్టులో కూడా మూడు రాజధానుల బిల్లు నిలవదని అర్ధమైంది. ఈ పరిణామాల మధ్యలో ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన…మూడు రాజధానులని ఉపసంహరించుకోవాలని జగన్‌కు సూచించారట.

ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…తిరుపతికి వచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో అమిత్‌షా రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పార్టీ నేతలను ఆదేశించారు. దీంతో తాజాగా ఏపీ బీజేపీ నేతలు రాజధాని ఉద్యమానికి మద్ధతు పలికారు. వారు మద్ధతు ఇచ్చిన నెక్స్ట్ డే జగన్…మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకున్నారు. అయితే ఈ గ్యాప్‌లో ఒక పెద్దాయన, జగన్‌కు ఫోన్ చేసి మూడు రాజధానుల చట్టంపై పునఃసమీక్షించుకోండి అని చెప్పారట.

ఇదంతా అసెంబ్లీ సమావేశాలు ముందే జరిగిందని తెలిసింది. అలాగే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాక మరోసారి ఆ పెద్దాయన ఫోన్‌చేసి, మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే జగన్..మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరి ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన ఆ పెద్దాయన..అమిత్ షా అని అంతా అనుకుంటున్నారు. ఆయన రాష్ట్రానికి వచ్చాకే పరిస్తితులు మారాయని అంటున్నారు. మొత్తం మీద జగన్ అయితే మూడుపై వెనక్కి తగ్గారు.

Discussion about this post