అధికార వైసీపీలో రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. వైసీపీలో రెడ్డి ఎమ్మెల్యేలే ఎక్కువ. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ రెడ్డి ఎమ్మెల్యేల్లో కొంతమంది మాత్రమే మంచి పనితీరు కనబరుస్తున్నారు. మిగిలిన వారు ఏదో జగన్ ఇమేజ్‌తో ముందుకెళ్లిపోతున్నారు. అయితే జగన్ ఇమేజ్ నమ్ముకుని సొంత ఇమేజ్ పెంచుకుని ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఎన్నికల్లో షాక్ తప్పేలా లేదు.

అలా జగన్ ఇమేజ్ మీద బేస్ అయిన ఎమ్మెల్యేలు అనంతపురంలో ఎక్కువగానే ఉన్నారు. జిల్లాలో 14 సీట్లు ఉంటే గత ఎన్నికల్లో వైసీపీ 12 సీట్లు గెలుచుకోగా, టిడిపి 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. వైసీపీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేల్లో 7 మంది రెడ్డి వర్గానికి చెందిన వారే. తాడిపత్రిలో పెద్దారెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, కదిరిలో సిద్ధారెడ్డి, పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి, రాప్తాడులో ప్రకాష్ రెడ్డి, అనంతపురం అర్బన్‌లో అనంత వెంకట్రామి రెడ్డి, గుంతకల్లులో వై. వెంకట్రామిరెడ్డిలు గెలిచారు.


మరి వీరిలో ఎంతమంది ఎమ్మెల్యేలు మంచి పనితీరు కనబరుస్తున్నారు…ఎంతమంది ఎమ్మెల్యేలకు టిడిపి నేతలు గట్టి పోటీ ఇస్తున్నారంటే…ఇందులో ఐదుగురు ఎమ్మెల్యేల పరిస్తితి కాస్త ఇబ్బందిగానే ఉందని చెప్పొచ్చు. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిలకు అంత అనుకూలమైన పరిస్తితులు ఉన్నట్లు కనిపించడం లేదు. అటు రాప్తాడులో ప్రకాష్, గుంతకల్లుల్లో వెంకట్రామిరెడ్డిల పనితీరు కూడా అనుకున్నంత గొప్పగా ఏమి లేదని తెలుస్తోంది.



అయితే ధర్మవరంలో కేతిరెడ్డికి, అనంతలో అనంత వెంకట్రామిరెడ్డి పనితీరుకు మంచి మార్కులే పడుతున్నాయి. ఈ ఇద్దరు మినహా మిగిలిన ఐదుగురు రెడ్డి ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఎన్నికల్లో కాస్త గడ్డు పరిస్తితి ఎదురయ్యేలా కనిపిస్తోంది. పైగా ఆయా నియోజకవర్గాల్లో టిడిపి నేతలు కూడా పుంజుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ రెడ్డి ఎమ్మెల్యేలకు నెక్స్ట్ షాక్ తప్పేలా లేదు.


Discussion about this post