రాష్ట్రంలో టీడీపీ బలం నిదానంగా పెరుగుతుందనే చెప్పొచ్చు…గత ఎన్నికలతో పోలిస్తే…ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్తితి బాగా మెరుగైంది…అలాగే టీడీపీ నేతలు కూడా చాలా దూకుడుగా పనిచేస్తున్నారు..ఎన్నికల్లో ఓడిపోయిన మొదట్లో టీడీపీ నేతలు బయటకు రావడానికి చాలా భయాపడ్డారు…బయటకొచ్చి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి ఆలోచించారు. పైగా వైసీపీ ఎడాపెడా కేసులు పెట్టేయడంతో తమ్ముళ్ళు వెనక్కి తగ్గారు..కానీ వరుసపెట్టి టీడీపీ నేతలని జైల్లో పెట్టించారు. జైలు నుంచి బయటకొచ్చిన నేతలు వైసీపీపై ఇంకా దూకుడుగా వెళ్ళడం మొదలుపెట్టారు.

పైగా వారిపై సానుభూతి కూడా పెరిగింది..దీంతో మిగిలిన టీడీపీ నేతలు బయటకొచ్చి పోరాటం చేయడం మొదలుపెట్టారు. అలాగే తమ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు…దీంతో ఇప్పుడు టీడీపీ పరిస్తితి చాలా మెరుగైంది. ఇప్పుడు దాదాపు అన్నీ జిల్లాల్లో టీడీపీ నేతలు యాక్టివ్‌గా పనిచేయడంతో ప్రతి జిల్లాలోనూ టీడీపీ…వైసీపీకి ధీటుగా వచ్చింది.

కానీ రెండు జిల్లాలోనే తమ్ముళ్ళు కాస్త వెనుకబడ్డారని చెప్పొచ్చు..చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని తెలుగు తమ్ముళ్ళు అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ జిల్లాల్లో పూర్తి స్థాయిలో టీడీపీ నేతలు యాక్టివ్ గా లేరు. అసలు వారు తమ తమ నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేయట్లేదు. దీంతో ఈ రెండు జిల్లాల్లో టీడీపీ చాలా వీక్‌గా కనిపిస్తోంది. జగన్ సొంత జిల్లా కడపలోనే టీడీపీ నేతలు చాలా దూకుడుగా పనిచేస్తున్నారు. వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు.

ఇటు కర్నూలు జిల్లాలో కూడా తెలుగు తమ్ముళ్ళు వెనక్కి తగ్గడం లేదు. కానీ నెల్లూరు, చిత్తూరు తమ్ముళ్ళు మాత్రం చాలా వీక్‌గా కనిపిస్తున్నారు..వీరు యాక్టివ్ అవ్వాల్సిన అవసరం ఉంది..అప్పుడే ఈ రెండు జిల్లాల్లో కూడా టీడీపీ కాస్త లైన్‌లో పడుతుంది..లేదంటే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఈ రెండు జిల్లాల్లో టీడీపీకి మంచి ఫలితాలు రావడం కష్టమనే చెప్పాలి.

Discussion about this post