రాజకీయాల్లో ప్రత్యర్ధులు స్ట్రాంగ్ ఉన్న ప్రాంతాలపై ఎక్కువ ఫోకస్ చేయాలి…అక్కడ ప్రత్యర్ధుల వీక్ పాయింట్లు తెలుసుకుని, ఎప్పటికప్పుడు దెబ్బకొడుతూ పుంజుకోవాలి. అలా కాకుండా తాము ఎలాగో వీక్‌గా ఉన్నాం కాబట్టి…ఆ ప్రాంతాలని ఇంకా గాలికొదిలేస్తే…మరింతగా వీక్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాల్లో టీడీపీది అదే పరిస్తితి. మామూలుగానే ఈ రెండు స్థానాల్లో టీడీపీకి ఏ మాత్రం పట్టు లేదు. కడపలో ఎప్పుడో 1984లో ఒకసారి టీడీపీ గెలిచింది. రాజంపేటలో 1984,1999 ఎన్నికల్లో గెలిచింది.


ఇంకా అంతే ఈరెండు చోట్ల టీడీపీకి మళ్ళీ గెలిచే అవకాశాలు రాలేదు. ఇక భవిష్యత్‌లో వస్తాయో రావో కూడా చెప్పలేని పరిస్తితి. అయితే ఇలాంటి వీక్ స్థానాల్లో ఎలాగోలా పార్టీని పైకి తీసుకురావాల్సిన బాధ్యత అధ్యక్షుడుది. కానీ చంద్రబాబు ఆ దిశగా మాత్రం పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. అంటే ఎలాగో గెలవడం కష్టమని అనుకున్నారేమో…అందుకే ఈ స్థానాలపై పెద్దగా ఫోకస్ చేయడం లేదు.

ఇప్పటికీ ఈ రెండు చోట్ల టీడీపీకి నేతలు లేరు. గత ఎన్నికల్లో రాజంపేటలో పోటీ చేసి ఓడిపోయిన డిఏ సత్యప్రభ అనారోగ్యంతో మరణించారు. ఇటు కడపలో పోటీ చేసి ఓడిపోయిన ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోయారు. అయితే కడప పార్లమెంట్ స్థానానికి లింగారెడ్డిని, రాజంపేటకు శ్రీనివాసులు రెడ్డిని అధ్యక్షులుగా పెట్టారు. పోనీ వీరే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటే ఆ విషయం కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.


వాస్తవానికి చూసుకుంటే రెండుచోట్ల వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అలాగే ఆ పార్టీ ఎంపీలు కూడా స్ట్రాంగ్. రాజంపేటలో మిథున్ రెడ్డి, కడపలో వైఎస్ అవినాష్ రెడ్డిలు ఉన్నారు. వీరిని ఓడించడం అంటే జరిగే పని కాదు..కానీ వైసీపీలో ఉన్న లోపాలని చూపెట్టి ప్రజలకు టీడీపీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే టీడీపీ నేతలు అలా చేయడం లేదు. అంటే మొత్తం మీద చూసుకుంటే కడప-రాజంపేటలని గాలికొదిలేసినట్లే అని చెప్పొచ్చు.

Discussion about this post