గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో కూడా ఓటమి పాలైన విషయం తెలిసిందే. 2014లో గెలిచిన సిట్టింగ్ సీట్లలో కూడా దారుణంగా ఓడిపోయింది. దాదాపు 80 సిట్టింగ్ సీట్లని టీడీపీ కోల్పోయింది. అయితే ఇదంతా జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలన్న ప్రజల తీర్పుతోనే జరిగింది…ఇక ప్రజలు..జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు…జగన్ పాలన చూస్తున్నారు..అలాగే వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో చూస్తున్నారు.

ఈ మూడేళ్లలో వైసీపీ వల్ల ఒరిగింది ఏంటో ప్రజలకు బాగా తెలిసింది. జగన్ మూడేళ్ళ పాలన చూశాక…చాలామంది ప్రజల అభిప్రాయం మారినట్లు కనిపిస్తోంది…అసలు జగన్ కంటే చంద్రబాబు పాలన బెటర్ అని అనుకునే పరిస్తితి కనిపిస్తోంది. అలాగే వైసీపీలో సగంపైనే ఎమ్మెల్యేల పనితీరు పట్ల కూడా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా సొంత పనులు చూసుకుంటున్నారు తప్ప..ప్రజలకు పనులు చేసి పెట్టడంలో విఫలమయ్యారనే చెప్పొచ్చు. అదే సమయంలో టీడీపీ నేతలు సైతం దూకుడుగా పనిచేసి…మళ్ళీ పార్టీని బలోపేతం చేయడంలో సక్సెస్ అవుతున్నారు.

అందుకే చాలాచోట్ల వైసీపీ బలం తగ్గుతుంటే…టీడీపీ బలం పెరుగుతుంది. ఇదే క్రమంలో 2014లో గెలిచి, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లలో టీడీపీ వేగంగా పుంజుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలనే దిశగా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి, కనిగిరి సీట్లని టీడీపీ కైవసం చేసుకునేలా ఉంది.

2014 ఎన్నికల్లో ఈ రెండు సీట్లలో టీడీపీ గెలిచింది…కానీ 2019 ఎన్నికల్లో ఓటమి పాలైంది. రెండు సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. అయితే ఇప్పుడు రెండు సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని తెలుస్తోంది. దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, కనిగిరిలో బుర్రా మధుసూదన్ యాదవ్ పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ రెండు చోట్ల మళ్ళీ వైసీపీ గెలవడం కష్టమే అని తెలుస్తోంది…మళ్ళీ ఈ రెండు చోట్ల 2014 ఎన్నికల సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Discussion about this post