2019 ఎన్నికల తర్వాత చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయిన విషయం తెలిసిందే. కొందరు టీడీపీకి రాజీనామా చేసి వేరే పార్టీల్లోకి వెళ్లిపోగా, మరికొందరు రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి నాయకులు లేకుండా పోయారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వరుసపెట్టి ప్రతి నియోజకవర్గంలో నాయకులని నియమించుకుంటూ వస్తున్నారు. అయితే ఇంకా పలు చోట్ల నాయకులని పెట్టాల్సిన అవసరముంది.

ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కొన్ని చోట్ల టీడీపీకి సరైన నాయకత్వం లేదు. పూతలపట్టు, చిత్తూరు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి నాయకులు లేరు. ఎన్నికలు అయ్యాక పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలితకుమారి టీడీపీని వీడారు. ఇటు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ సైతం టీడీపీకి రాజీనామా చేసేశారు. దీంతో రెండు చోట్ల టీడీపీకి నాయకులు లేకుండా పోయారు. ఇక ఇప్పటివరకు రెండు చోట్ల నాయకులని నియమించలేదు.


అయితే చిత్తూరు సీటు కోసం మాత్రం గట్టి పోటీ ఉంది. ఇక్కడ టీడీపీ కాస్త స్ట్రాంగ్‌గా ఉంది. పైగా కమ్మ-బలిజ వర్గాల డామినేషన్ ఉంది. వచ్చే ఎన్నికల్లో పవన్ గానీ టీడీపీకి సపోర్ట్ ఇస్తే చిత్తూరులో బలిజ వర్గం ఓట్లు ప్లస్ అవుతాయి. అందుకే ఈ సీటుని దక్కించుకోవడం కోసం పలువురు నేతలు ట్రై చేస్తున్నారు. చంద్రగిరి ఇంచార్జ్‌గా ఉన్న పులివర్తి నాని కూడా ఈ సీటు కోసం చూస్తున్నారు. ఎందుకంటే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓడించడం జరిగే పని కాదు.


అలాగే బలిజ వర్గానికి చెందిన కాజూరు బాలాజీ, కటారి హేమలతలు సైతం చిత్తూరు సీటు ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉండటంలో ముందున్నారు. అయితే బాలాజీ ఇంకా ఎక్కువగా ప్రజల మధ్యలో ఉంటూ, వారికి అండగా ఉంటున్నారు. సొంత డబ్బులు సైతం ఖర్చు పెడుతూ పనులు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో బాలాజీకు ఎక్కువ మద్ధతు పెరిగింది. కాబట్టి బాలాజీకు చిత్తూరు సీటు ఇస్తే బెటర్ అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి చంద్రబాబు ఈ సీటు విషయంలో త్వరగా నిర్ణయం తీసుకుంటే బెటర్.


Discussion about this post