May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

వైసీపీకి ఎదురుదెబ్బ..టీడీపీకి ఆ జిల్లాల్లో వన్‌సైడ్.!

గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో వైసీపీ హవానే..మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో..4 జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది..ఇక మిగిలిన జిల్లాల్లో వైసీపీదే ఆధిక్యం. అందుకే వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. మరి గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో సత్తా చాటిన వైసీపీ..ఈ సారి పరిస్తితి ఎలా ఉంటుందంటే..వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదనే చెప్పవచ్చు. రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి కాస్త ఆధిక్యం రావచ్చు..అందులోనూ అనంతపురంలో లీడ్ కష్టమే.

ఇక మిగిలిన జిల్లాల్లో వైసీపీకి ఆధిక్యం కష్టమనే పరిస్తితి. ప్రస్తుతం వస్తున్న సర్వేలని బట్టి చూస్తే..మెజారిటీ జిల్లాల్లో టీడీపీకి ఆధిక్యం వస్తుందని తెలుస్తుంది. శ్రీకాకుళంలో ఈ సారి టి‌డి‌పికి ఆధిక్యం తప్పనిసరి వస్తుందనే చెప్పవచ్చు. గత ఎన్నికల్లో విజయనగరంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది..కానీ ఈ సారి అక్కడ టి‌డి‌పికి లీడ్ రానుందని తెలుస్తుంది. విశాఖకు వస్తే ప్రస్తుతం టి‌డి‌పికే ఆధిక్యం..జనసేనతో పొత్తు ఉంటే ఫుల్ మెజారిటీ వస్తుంది.

తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొత్తు ప్రభావం భారీగా ఉంటుంది. టి‌డి‌పి-జనసేన కలిస్తే..ఈ జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవడం ఖాయం. వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కృష్ణా-గుంటూరు జిల్లాల్లో కూడా పొత్తు ప్రభావం ఉంటుంది..ఈ జిల్లాల్లో టీడీపీ-జనసేనకే మెజారిటీ సీట్లు వస్తాయి. అటు ప్రకాశంలో ప్రస్తుతానికి టి‌డి‌పి-వైసీపీల మధ్య పోటీ ఉంది. కాస్త టి‌డి‌పికే ఎడ్జ్ కనిపిస్తుంది. నెల్లూరులో కూడా అదే పరిస్తితి. చిత్తూరు, కర్నూలు, కడపలో వైసీపీకి లీడ్ ఖాయమే..అనంతలో టి‌డి‌పికి లీడ్ ఉంటుంది. మొత్తానికి మెజారిటీ జిల్లాల్లో టి‌డి‌పికే ఆధిక్యం వచ్చే ఛాన్స్ ఉంది.