మొదట నుంచి ఎస్సీ స్థానాల్లో వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న విషయం తెలిసిందే…గత రెండు ఎన్నికల్లోనూ ఎస్సీ స్థానాల్లో వైసీపీ పైచేయి సాధించింది.. ఆ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. అసలు గత ఎన్నికల్లో అయితే…దాదాపు అన్నీ స్థానాలని కైవసం చేసుకుందని చెప్పొచ్చు. రాష్ట్రంలో 29 ఎస్సీ స్థానాలు ఉండగా, అందులో 27 స్థానాలు వైసీపీ గెలుచుకుంది..ఒకటి టీడీపీ, ఒకటి జనసేన గెలుచుకుంది. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపుకు వచ్చిన విషయం తెలిసిందే.

దీంతో రాష్ట్రంలో ఎస్సీ స్థానాల్లో వైసీపీ హవా పెరిగినట్లు అయింది…అలా ఎస్సీ స్థానాల్లో ఆధిక్యలో ఉన్న వైసీపీకి నిదానంగా ఇబ్బందులు వస్తున్నాయి..ఎస్సీ స్థానాల్లో వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది. ఇప్పటికే సగం ఎస్సీ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి..చాలామంది ఎమ్మెల్యేల పనితీరు ఏమి బాగోలేదని, వారు మళ్ళీ ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమని తెలుస్తోంది.

ఇలా వైసీపీ వీక్ అయిన స్థానాల్లో టీడీపీ వేగంగా పికప్ అవుతుంది…ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఎస్సీ స్థానాల్లో పార్టీ బలాన్ని మరింత పెంచేందుకు టీడీపీ నేతలు పనిచేస్తున్నారు..ఇదే క్రమంలో ఇటీవల దళిత ప్రతిఘటన పేరిట…వైసీపీ హయాంలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ నేతలు గళం విప్పుతున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు…ప్రతి జిల్లా తిరుగుతూ, దళితులకు అన్యాయంపై ప్రశ్నిస్తున్నారు.

ఇలా జిల్లాల్లో దళిత సభలు పెడుతూ టీడీపీ దూసుకుపోతుంది…ఈ సభల వల్ల టీడీపీకి మరింత అడ్వాంటేజ్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి..ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీ బలం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అయితే టీడీపీ ఇంకాస్త కష్టపడితే మెజారిటీ ఎస్సీ స్థానాలని కైవసం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ స్థానాల్లో వైసీపీకి డ్యామేజ్ భారీగానే ఉండొచ్చు.

Discussion about this post