తెలుగుదేశం పార్టీ ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలనే కసితో పనిచేస్తుంది..ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టి అధికార పీఠం దక్కించుకోవాలని చంద్రబాబు కష్టపడుతున్నారు. అటు టీడీపీ నేతలు సైతం మొదట్లో వైసీపీకి భయపడ్డ..ఇప్పుడు ధైర్యంగా పోరాటాలు చేస్తున్నారు. అటు అధికార వైసీపీపై కాస్త వ్యతిరేకత పెరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీకి కాస్త అనుకూలమైన వాతావరణం ఉందని సర్వేల్లో తేలింది.

తాజాగా టీడీపీ నిర్వహించిన ఓ అంతర్గత సర్వేలో మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా వెళ్ళినట్లు తెలిసింది. 175 స్థానాలు ఉన్న ఏపీలో అధికారంలోకి రావడానికి కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 88. అయితే తాజా సర్వేలో టీడీపీకి 70-75 స్థానాలు వస్తాయని తేలిందట. అంటే 13-18 సీట్లు వెనుకబడి ఉంది. ఇంకా ఎన్నికల నాటికి ఈ పరిస్తితి మారే ఛాన్స్ ఉందని పైగా జనసేన తో పొత్తు ఉంటే రిజల్ట్ మారుతుందని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సర్వేలో కొన్ని జిల్లాల్లో టీడీపీ కాస్త వెనుకబడి ఉందని తెలిసింది.

విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీకే ఆధిక్యం ఉందని తేలిందట. విజయనగరంలో 9 స్థానాలు ఉంటే టీడీపీకి 4 సీట్లలో గెలిచే ఛాన్స్ ఉందట. కర్నూలులో 14 సీట్లకు 4-5 సీట్లు, చిత్తూరులో 14 సీట్లకు 4-5, కడపలో 10 సీట్లకు 2, నెల్లూరులో 10 సీట్లకు 3 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందని తేలిందట.

ఇక కొన్ని జిల్లాల్లో వైసీపీతో పోటీగా టీడీపీ ఉంది. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో రెండు పార్టీలు సమానంగా ఉన్నాయి. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి స్వల్ప ఆధిక్యం ఉందని తేలింది. కానీ ఈ జిల్లాల్లో జనసేన ప్రభావం ఉంది. ఒకవేళ ఆ పార్టీతో పొత్తు ఉంటే టీడీపీ సత్తా చాటే ఛాన్స్ ఉంది.

Leave feedback about this