రాజకీయాల్లో జంపింగులు అనేవి సహజమే..నేతలు అధికారం కోసం పార్టీలు మారిపోతుంటారు. అలా ఇప్పటివరకు ఏపీ రాజకీయాల్లో ఎంతమంది నేతలు జంపింగులు చేశారో చెప్పాల్సిన పని లేదు. అధికారం మారిన ప్రతిసారి జంపింగులు సహజమే. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, వైసీపీ నేతలు ఆ పార్టీలోకి జంప్ చేశారు. ఇప్పుడు సీన్ మారింది…టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు నడుస్తున్నాయి.

అయితే ఈ మధ్య కాస్త వలసలు ఆగినట్లే కనిపిస్తున్నాయి. కానీ ఇటీవల చంద్రబాబు తీసుకున్న ఒక నిర్ణయంతో జంపింగులు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో సరిగ్గా పనిచేయని మాజీ ఎమ్మెల్యేలని పక్కనబెట్టి….కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇక కొత్త నాయకులు ఫీల్డ్‌లోకి పనిచేస్తున్నారు…మరి సైడ్ అయిన మాజీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనేది క్లారిటీ లేదు. వాళ్ళు చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవించి టీడీపీలోనే పనిచేసుకుంటారా…లేక బాబు తమని పక్కనబెట్టడంపై అసంతృప్తిగా ఉండి వేరే పార్టీలోకి జంప్ చేస్తారనేది తెలియడం లేదు.

అయితే కొందరు నేతలు వీలు చూసుకుని వైసీపీలోకి జంప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పామర్రు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అటు వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె గతంలోనే టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్లింది. మళ్ళీ 2014లో వైసీపీ తరుపున గెలిచి టీడీపీలోకి వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయాక అసలు పార్టీలో పనిచేయడం లేదు. పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు.

దీంతో ఆమెని సైడ్ చేసి సీనియర్ నేత వర్ల రామయ్య తనయుడు వర్ల కుమార్ రాజాకు బాధ్యతలు అప్పగించారు. దీంతో కల్పన టీడీపీని వదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు మాడుగులలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుని తప్పించి, పీవీజీ కుమార్‌ని ఇంచార్జ్‌గా పెట్టగా, సాలూరులో రాజేంద్ర ప్రతాప్‌ని పక్కనబెట్టి గుమ్మడి సంధ్యారాణికి బాధ్యతలు అప్పగించారు. మరి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్ అయిపోతారో లేక టీడీపీలోనే కంటిన్యూ అవుతారో చూడాలి.


Discussion about this post