నింగి విరిగి నేలపై పడుతున్నా.. ఆయన చాలా సున్నితంగా స్పందిస్తారు. ఎవరినీ ఏమీ అనరు. ప్రజల్లోకి వెళ్లినా.. మీడియా ముందు మాట్లాడినా.. చాలా పద్ధతిగా మాట్లాడారు. ఇది మంచిదే. ఇప్పుడున్న నేతలకు భిన్నంగా ఆయన ఉండడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. అయితే.. ఇది ఎంతవరకు ఆయనకు ప్లస్ అవుతుంది? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. వచ్చే ఎన్నికలు హీటెక్కెనున్నాయి. నువ్వా నేనా.. అనే రేంజ్‌లో సాగనున్నాయి. ఈ క్రమంలో గొంతు సవరించుకుని.. ఫైర్ బ్రాండ్‌గా మారాల్సిన అవసరం నేతలకు కనిపిస్తోంది. లేకపోతే.. ప్రజల్లోకి వెళ్లడం కూడా కష్టమే. ఇదే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు పరిశీలకులు.

ఆయన టీడీపీకి చెందిన సాఫ్ట్ కార్నర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వరుస విజయా లు దక్కించుకున్న ఆయన సుదీర్ఘ రాజకీయంలో ఎప్పుడూ వివాదాల జోలికి పోలేదు. ఎప్పుడూ సౌమ్యుడిగానే పేరు తెచ్చుకు న్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలను కూడా చాలా పద్ధతిగా విమర్శిస్తారు. నోరు పారేసుకోరు. ఎంత కోపం వచ్చినా.. తమాయించుకు ని మాట్లాడతారు. ఘర్షణలకు దూరంగా ఉంటారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతారనే పేరు తెచ్చుకున్నారు.

అయితే.. విజయ వాడ రాజకీయాలు మారుతున్నాయి. టీడీపీ నేతలు అందరూ కూడా దాదాపు ఫైర్ బ్రాండ్లుగానే ఉన్నారు. సెంట్రల్ మాజీ ఎమ్మె ల్యే బొండా ఉమా.. ఎంపీ కేశినేని నాని.. మాజీ ఎమ్మెల్సీబుద్దా వెంకన్న.. ఇలా.. అందరూ కూడా సంచలన వ్యాఖ్యలతో ముందున్నారు. మరోవైపు మహిళా నాయకురాలు పంచుమర్తి అనురాధ కూడా సంచలన కామెంట్లతో మీడియా ముందుకు వస్తున్నారు. కానీ, ఎమ్మెల్యేగా ఉండి కూడా గద్దె రామ్మోహన్ ఎప్పుడూ.. హీటెక్కించే పాలిటిక్స్ చేయలేదు. హీటెక్కించే వ్యాఖ్యలు కూడా చేయలేదు.

అయితే.. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా..ఆయన కూడా మారాలని.. గొంతు పెంచాలని పార్టీ నుంచి అనేక సూచనలు వస్తున్నాయి. పైగా తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ననేతల దూకుడు మామూలుగా లేదని.. వారితో పోటీ పడితేనే తప్ప.. వచ్చే ఎన్నికల్లో మాస్ ఓటర్లను ఆకట్టుకోవడం కష్టమని.. కూడా సలహాలు వస్తున్నాయి. అయినప్పటికీ.. రాముడు మంచి బాలుడు..అన్న విధంగానే ఆయన రాజకీయాలు చేస్తుండడం చంద్రబాబుకు సైతం చిరాకు తెప్పిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.

Discussion about this post