టీడీపీ అధినేత చంద్రబాబు మార్కు క్లాస్ అంటే.. అందరికీ తెలిసిందే. ముఖ్యంగా.. పార్టీలో అయితే.. ఆ యన క్లాస్ ఇచ్చారంటే.. నాయకులకు ఓ సంవత్సరంపాటు.. ఇక, పార్టీ.. కార్యాలయం తప్ప.. మరొకటి గు ర్తుకు రాదు. అలా ఉంటుంది. గతంలో చంద్రబాబు పాలనాకాలంలో అనేక మందికి ఇలానే క్లాస్ ఇచ్చి పంపించారు. అప్పట్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారి వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని భా వించిన బాబు.. ఆదిశగా ప్రయత్నాలు చేశారు.
అయితే… ఇప్పుడు అవినీతి సమస్య కాదు. అలసత్వం.. అగమ్య గోచరం అనే సమస్యలతో పార్టీ తీవ్ర ఇ బ్బందులు పడుతోంది. చంద్రబాబు ఆశిస్తున్న విధంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగోలేదని.. అందరూ చెబుతున్నారు. ఈ విషయం.. విజన్ ఉన్న నాయకుడిగా..చంద్రబాబుకు కూడా తెలుసు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ.. యువత ఇప్పుడు భారీగానే ఉన్నారు. ఎక్కువ మంది వారసులు కూడా ఉన్నారు. అయితే.. వీరిలో చాలా మంది కార్యక్రమాలు నిర్వహించడం లేదు. పార్టీ అంటే.. ఎన్నికలకు ముందు చూసుకోవచ్చు అనేధోరణిలో ఉన్నారు.
మరికొందరు.. పార్టీ అంటే.. తమకు అన్నివిధాలా ఉపయోగపడేది.. తమ కష్టాలు తీర్చేది.. అనే ఆలోచన చేస్తున్నారు. ఫలితంగా.. యువ నేతలు ఉన్నా.. యుద్ధప్రాతిపదికన .. పార్టీని ముందుకు నడిపించేవారు… వ్యూహాత్మకంగా వ్యవహరించి..పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్లేవారు….చాలాచాలా తక్కువ మందే కనిపిస్తు న్నారు. ఈ పరిణామాల వెనుక.. పార్టీలో ఎలాంటి.. అసంతృప్తులు కానీ… మరొకటి కానీ.. లేవు. కేవలం అలసత్వం.. ఇప్పుడే… వెళ్లి ఏం చేస్తాంలే.. సినిమా మొదలయ్యాక చూద్దాం.. అనే ధోరణి రెండు కనిపిస్తున్నాయి.
ఫలితంగా.. వైసీపీ బలహీనంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా.. టీడీపీ పుంజుకోవడం లేదు. పోలవరం, పాడేరు, అరకులోయ, విజయవాడ పశ్చిమ.. ఇలా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఇప్పుడు టీడీపీ పావలా అంత పనిచేస్తే.. చాలు. ప్రజలు ముప్పావలా ఫలితం ఇచ్చేందుకురెడీగా ఉన్నారు. అయితే.. ఎవరూ ముందుకు రాని పరిస్తితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆయా నేతలకు చంద్రబాబు తన మార్కు క్లాస్ ఇస్తే.. తప్ప.. ప్రయోజనం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి బాబు వారికి క్లాస్ ఇస్తారో లేదో చూడాలి.
Discussion about this post