గత ఎన్నికల్లో చాలామంది సీనియర్ నేతల వారసులు తొలిసారి బరిలో దిగిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది వారసులు సక్సెస్ అవ్వగా, మరికొంతమంది ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతలకు చెందిన వారసులు ఫెయిల్ అయ్యారు. దాదాపు టీడీపీ నేతల వారసులు విజయం సాధించలేకపోయారు. కానీ ఈ సారి విజయం సాధించాలనే కసితో ఆ వారసులు పనిచేస్తున్నారు. ఎలాగైనా తొలి విజయం అందుకోవాలని చూస్తున్నారు.

అలా తొలి విజయం అందుకోవాలని చూస్తున్న వారిలో సీనియర్ నేతలైన శ్యామ్ సుందర్ శివాజీ, అశోక్ గజపతి రాజుల వారసురాళ్ళు ఉన్నారు. పలాస నియోజకవర్గానికి చెందిన శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గౌతు లచ్చన్న వారసుడుగా ఆయన రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. ఇక ఆయన వారసురాలుగా గౌతు శిరీష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక గత ఎన్నికల్లో తొలిసారి పలాస నుంచి పోటీ చేసి సీదిరి అప్పలరాజు చేతిలో ఓటమి ప్లాయ్యారు.

శిరీష ఓడిపోయిన దగ్గర నుంచి పలాసలో యాక్టివ్‌గానే పనిచేస్తున్నారు…మంత్రి అప్పలరాజు నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైన కార్యకర్తలకు అండగా ఉంటూ, పలాసలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఈ రెండున్నర ఏళ్లలో ఆమె చాలా వరకు పికప్ అయ్యారు..పైగా అపోజిట్‌లో అప్పలరాజుపై ప్రజా వ్యతిరేకత పెరగడం శిరీషకు బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. ఇదే పరిస్తితి కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో శిరీష ఫస్ట్ విక్టరీ కొట్టేలా ఉన్నారు.

ఇటు అశోక్ గజపతి వారసురాలు అతిథి గజపతి సైతం గత ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీలో కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఓడిపోయారు. ఓడిపోయాక ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పనిచేస్తున్నారు. మళ్ళీ తమ కంచుకోటని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే విజయనగరం అసెంబ్లీలో అతిథి లీడ్ తెచ్చుకున్నట్లే కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో అతిథికి కూడా మొదటి విజయం ఖాయమయ్యేలా ఉంది.

Discussion about this post