రాజకీయాల్లో గెలుపోటములని డిసైడ్ చేసేది ప్రజలే అందులో ఎలాంటి డౌట్ లేదు..మెజారిటీ ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారో ఆ పార్టీ గెలుస్తుంది. అయితే ఇందులో వర్గాల వారీగా ఓట్లని చూస్తారు. ఎక్కువ ఓట్లు ఉన్న వర్గంపై పార్టీలు ఫోకస్ చేస్తాయి. అదే సమయంలో మహిళలు, యువత ఓటు బ్యాంకు చాలా కీలకమని చెప్పవచ్చు. వారు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి.
గత ఎన్నికల్లో వారే వైసీపీకి భారీ మెజారిటీ కట్టబెట్టడంలో కృషి చేశారు. కానీ ఇప్పుడు వారికే న్యాయం జరగడం లేదు..దీంతో ఆ ఓటు బ్యాంకు మారుతూ వస్తుంది. ముఖ్యంగా యువతకు వైసీపీ చేసిందేమి లేదు. ప్రత్యేక హోదా తెచ్చి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు..అలాగే ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు..కానీ ఏది చేయడం లేదు. ఏదో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ సచివాలయ ఉద్యోగాలు కొందరికి వచ్చాయి. కానీ రాష్ట్రంలో నిరుద్యోగులు 20 లక్షల వరకు ఉన్నారు. దీంతో వారు జగన్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఆ సంతృప్తి..మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనబడింది..వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి టిడిపిని గెలిపించారు.
అయితే లాంటి నిరుద్యోగ యువతని ఇంకా పెద్ద ఎత్తులో టిడిపి వైపు తిప్పేందుకు లోకేష్ కష్టపడుతున్నారు. తన పాదయాత్రలో ప్రధానంగా యువతపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అందుకే యువతతో ఎక్కువ సమావేశం అవుతూ వారి సమస్యలని తెలుసుకుంటున్నారు. ఇక యువత కూడా లోకేష్ పట్ల పాజిటివ్ గా ఉన్నారు. ఆయన మాటలు ఆకట్టుకుంటున్నాయి.
ఈ సారి వారు టిడిపి వైపుకు తిరిగేలా ఉన్నారు. గత ఎన్నికల్లో మెజారిటీ యువత వైసీపీ వైపు వెళ్ళగా, ఆ తర్వాత జనసేన వైపుకు వెళ్లారు. కానీ టిడిపికి తక్కువ వచ్చారు. కానీ ఈ సారి సీన్ మారింది..టిడిపి వైపుకు యువత రానున్నారు.
