ఏపీలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు మొదట నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటలుగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఏజెన్సీ నియోజకవర్గాల్లో టీడీపీకి ఎప్పుడు మంచి విజయాలు దక్కలేదు. అయితే కాంగ్రెస్ కనుమరుగయ్యాక…ఏజెన్సీ నియోజకవర్గాల్లో వైసీపీ సత్తా చాటుతుంది…గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీని బీట్ చేయడం టీడీపీకి సాధ్యం కావడం లేదు. దీంతో టోటల్‌గా వైసీపీ హవా నడుస్తోంది. అయితే ఈ రెండున్నర ఏళ్లలో కాస్త పరిస్తితులు మారినట్లు కనిపిస్తున్నాయి. ఈ సారి వైసీపీకి రివర్స్ అయ్యే పరిస్తితులు ఉన్నాయి.

ఇంతకాలం వైసీపీని అదరిస్తున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలు..ఈ సారి టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో టీడీపీకి అవకాశాలు ఇచ్చేలా కనిపిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల టీడీపీకి బాగా కలిసొస్తుంది. గత రెండు పర్యాయాలు వైసీపీ అభ్యర్ధులే గెలవడం..పైగా గెలిచిన నేతలు ఏజెన్సీ నియోజకవర్గాల్లో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడంతో పరిస్తితులు మారిపోయాయి.’

అలాగే వైసీపీకి ధీటుగా టీడీపీ నేతలు కూడా పనిచేస్తున్నారు..దీంతో పలు నియోజకవర్గాల్లో టీడీపీకి మంచి అవకాశాలు వచ్చాయి. అలా టీడీపీకి మంచి అవకాశాలు వచ్చిన నియోజకవర్గాలు వచ్చి…పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలు. 2014 ఎన్నికల్లో పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరిలు వైసీపీ నుంచి గెలిచారు…వీరి గెలిచాక టీడీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో వీరు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.


వైసీపీ నుంచి పాడేరులో భాగ్యలక్ష్మీ, రంపచోడవరంలో ధనలక్ష్మీలు గెలిచారు. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రెండున్నర ఏళ్లలోనే ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అనుకున్న మేర ప్రజలకు అండగా ఉండటంలో విఫలమయ్యారు. దీంతో రెండుచోట్ల వైసీపీకి వ్యతిరేకత పెరిగింది. అదే సమయంలో టీడీపీ కూడా పికప్ అయింది. పైగా వరుసగా ఓడిపోతున్న సానుభూతి ఉంది…కాబట్టి ఈ సారి రెండు వైసీపీ కంచుకోటల్లో సైకిల్ సవారీ సాగేలా ఉంది.


Discussion about this post