ఏంటో తెలుగు రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన వారు…మళ్ళీ ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమైపోతుంది…ఏదో కొంతమందికే అదృష్టం ఉంటుంది తప్ప…మిగిలిన వారికి పెద్దగా లక్ ఉండదు…వారు ప్రజల నుంచి తిరస్కరణకు గురి అవ్వాల్సి ఉంటుంది. అంటే మంత్రులుగా పనిచేయడం వల్ల..సొంత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం…అలాగే తమ శాఖలకు పెద్దగా న్యాయం చేయకపోవడం, ఇంకా పలు ఆరోపణలు ఎదురుకోవడం వల్ల లాంటి కారణాల వల్ల..చాలామంది మంత్రులు మళ్ళీ గెలవలేరు.

గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారి పరిస్తితి కూడా అంతే…దాదాపు అందరూ మంత్రులు ఓడిపోగా, కేవలం అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప మాత్రమే గెలిచారు…మిగిలిన వారంతా ఓడిపోయారు. ఇక ఇప్పుడు వైసీపీ మంత్రుల పరిస్తితి కూడా అంతేలా ఉంది..ఇటీవల జగన్ మంత్రివర్గంలో మార్పులు చేసిన విషయం తెలిసిందే…కొంతమందిని సైడ్ చేసి కొత్తవారిని క్యాబినెట్ లోకి తీసుకున్నారు…అయితే మాజీ మంత్రులైన వారి పరిస్తితి కూడా అంతా ఆశాజనకంగా లేదని చెప్పొచ్చు..మాజీ మంత్రుల్లో కొందరు ఓటమి అంచున ఉన్నట్లు తెలుస్తోంది.

మాజీ మంత్రుల విషయం పక్కనబెడితే…ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిలో కూడా కొందరు…మళ్ళీ గెలవడం కష్టమని తెలుస్తోంది. చాలామంది మంత్రులు డేంజర్ జోన్ లో ఉన్నారని అర్ధమవుతుంది. అయితే టీడీపీ-జనసేన వేరు వేరుగా పోటీ చేస్తే కొందరు సేవ్ అవుతారు…అదే రెండు పార్టీలు గెలిస్తే చాలామంది మంత్రులు ఓటమి అంచుకు చేరినట్లే.

మొత్తానికి డేంజర్ జోన్ లో ఉన్న మంత్రులు వచ్చి… అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, మేరుగు నాగార్జున, విడదల రజిని, అంబటి రాంబాబు, నారాయణస్వామి, ఉషశ్రీ చరణ్, రోజా, గుమ్మనూరు జయరాం..ఈ మంత్రులు నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం అనేది చాలా కష్టమయ్యేలా ఉంది…ఏదో అదృష్టం ఉంటే…కొంతమంది బయటపడే ఛాన్స్ ఉంది గాని…మొత్తానికి మాత్రం ఈ మంత్రులకు మళ్ళీ ఛాన్స్ కనబడటం లేదు.

Discussion about this post