ప్రతిపక్ష టీడీపీపై గానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై గానీ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యేవారు ఎవరైనా ఉన్నారంటే వారు మంత్రులే. అసలు మంత్రులు…వాళ్ళ శాఖలకు సంబంధించి ఎంత బాగా పనిచేస్తున్నారో తెలియదు గానీ..చంద్రబాబుని తిట్టడంలో మాత్రం బాగా ముందు ఉంటారు. చంద్రబాబు ఏమన్నా మాట్లాడితే చాలు..వెంటనే మీడియా సమావేశం పెట్టి విరుచుకుపడతారు. తమ శాఖల పరంగా ప్రజలకు అండగా ఉండటం కంటే..జగన్‌పై ఈగ వాలనివ్వకుండా మాత్రం బాగా చూసుకుంటారు.

ఇంకా మంత్రులు అంటే ప్రత్యర్ధులని తిట్టడానికే అన్నట్లు పరిస్తితి ఉంది. ఇక అలాంటి మంత్రులకు చెక్ పెట్టాలని టీడీపీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఎవరైతే విరుచుకుపడుతున్నారో..ఆ మంత్రులని నెక్స్ట్ ఎన్నికల్లో చిత్తు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో మాదిరిగా మిస్టేక్‌లు చేయకుండా మంత్రులకు చెక్ పెట్టాలని చూస్తుంది.

అందులో భాగంగా కొందరు మంత్రులకు ప్రత్యర్ధులని కూడా మారుస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిని కాకుండా ఈ సారి వేరే నాయకులని రంగంలోకి దింపడానికి టీడీపీ సిద్ధమైంది. ఇప్పటికే మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిల ప్రత్యర్ధులని మార్చారు. పుంగనూరులో చల్లా రామచంద్రారెడ్డిని, డోన్‌లో సుబ్బారెడ్డిని ఇంచార్జ్‌లుగా పెట్టారు. అలాగే గుడివాడలో మంత్రి కొడాలి నాని, విజయవాడ వెస్ట్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్‌ల ప్రత్యర్ధులు కూడా మారే అవకాశాలు ఉన్నాయి.








ఇక మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లపై పోటీ చేసే టీడీపీ నాయకులు మారనున్నారని తెలుస్తోంది. అటు మహిళా మంత్రులైన పుష్పశ్రీ వాణి, సుచరిత, వనితల ప్రత్యర్ధులు కూడా మారడం ఖాయం. అవంతి శ్రీనివాస్, కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాల్‌లపై టీడీపీ నుంచి కొత్త అభ్యర్ధులు పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు కాకుండా ఈ సారి…మంత్రులపై కొత్త ప్రత్యర్ధులు రంగంలోకి దిగనున్నారు.





Discussion about this post