కొందరు అంతే.. నాయకులైనా.. సామాన్యులైనా.. తమకు తిరుగులేదని అనుకుంటే.. ఆకాశానికి ఎగిరిపోతా రు.. ఇక, తమకు ఎక్కడా అవకాశాలు దక్కడం లేదని అనుకుంటే.. మాత్రం నేలకుదిగిపోతారు. ఇప్పుడు వైసీపీకి చెందిన ఒక కీలక ఎమ్మెల్యే కూడా .. తనపై తానే ఆశలు వదిలేసుకున్నారట. ఇక, నేను ఎట్టి పరిస్థితిలోనూ గెలిచేది లేదు.. అని ఆయన అనుచరులతో చెప్పుకొచ్చారట. ప్రస్తుతం ఈ టాపిక్.. వైసీపీలో ఆసక్తిగా మారింది. ఆయనే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.

నిర్మొహమాటంగా.. మాట్లాడే నాయకుడిగా ఆయనకు పార్టీలో పేరుంది. ఇటీవల.. ఓ పనిమీద ఆయన తాడేపల్లికి వచ్చారట. ఈ సందర్భంగా ఎదురు పడిన.. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు “ఎలా ఉంది.. సార్ మీ నియోజకవర్గం?“ అని ప్రశ్నించగానే.. బియ్యపు డీలా పడిపోయారట. ఏం చెప్పమంటా వులే.. అన్నా.. అంటూ.. ఏకంగా.. కన్నీరు మున్నీరు అయ్యేంతగా తన పరిస్థితిని చెప్పుకొచ్చారట. ఎక్కడా తనకు గెలిచే అవకాశాలు కనిపించడం లేదని.. వాపోయారట.

దీనికి కారణం.. ఇటీవలటీడీపీ మాజీ మంత్రి బొజ్జలగోపాల కృష్ణారెడ్డి మరణించారు. ఈయన అంత్యక్రియ లు.. శ్రీకాళహస్తిలోని ఆయన సొంత ఊరు.. ఊరందూరులో నిర్వహించారు. అయితే.. ఈ కార్యక్రమానికి ప్రజలు పోటెత్తడం.. స్వచ్ఛందంగా .. శ్రీకాళహస్తిలో వ్యాపార వర్గాలు బంద్ పాటించడం.. వంటివి.. ఎమ్మెల్యేకు గుబులు రేపుతున్నాయట. అంటే.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఈ సెంటిమెంటుతో తమ ఓటును బొజ్జల కుటుంబానికి వేయడం ఖాయమని ఒక నిర్ణయానికి వచ్చేశారట.

పైగా.. తాను ప్రజల మద్యకు వెళ్తున్నా.. గడప గడప కార్యక్రమం నిర్వహిస్తున్నా.. ఆశించిన విధంగా మైలేజీ రావడం లేదని.. ఆయన చెబుతున్నారట. దీనిని ఎలా తగ్గించుకోవాలని.. ఆయన ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బొజ్జల కుటుంబానికి సెంటిమెంటు పవనాలు పెరుగుతుండడం.. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు రావడం.. వంటి పరిణామాలు.. ఎమ్మెల్యేకు కంటిపై నిద్ర లేకుండా చేస్తున్నాయని.. ఆయన అనుచరులు కూడా చెబుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Discussion about this post