నెల్లూరు జిల్లా టీడీపీలో పలు మార్పులు చేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు..బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేయడం కోసం కొత్త మార్పులతో ముందుకొచ్చేలా ఉన్నారు. అయితే నెల్లూరులో టీడీపీకి పెద్ద బలం లేని విషయం తెలిసిందే..ఇక్కడ పార్టీ అంత స్ట్రాంగ్‌గా లేదు..పైగా గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోలేదు. సరే ఎన్నికల తర్వాతైన నెల్లూరులో టీడీపీ బలపడుతుందా? అంటే లేదనే చెప్పాలి. రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో పార్టీ పరిస్తితి మెరుగు అవుతుంది గాని…నెల్లూరులో మాత్రం టీడీపీ పికప్ అవ్వడం లేదు.

అందుకే ఇక్కడ నాయకత్వంలో మార్పులు చేయాలని బాబు చూస్తున్నారు…ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో మార్పులు చేయడానికి రెడీ అయ్యారు. ఇదే క్రమంలో కోవూరు సీటులో కూడా ఏమన్నా మార్పులు చేస్తారా? అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు…అక్కడ ఆయన్ని ఆపే శక్తి టీడీపీకి కనిపించడం లేదు..నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ప్రసన్న సత్తా చాటేలా ఉన్నారు.

ఇక ఇక్కడ ఉన్న టీడీపీ నాయకుడు పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పెద్దగా బలపడినట్లు కనిపించడం లేదు. 2014 ఎన్నికల్లో కాస్త టీడీపీ వేవ్, నల్లపురెడ్డిపై వ్యతిరేకత ఉండటంతో పొలంరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఐదేళ్లలో ఎమ్మెల్యేగా పొలంరెడ్డి గొప్ప పనితీరు ఏమి కనబర్చలేదు..అందుకే గత ఎన్నికల ముందు ఆయనకు సీటు ఇవ్వొద్దని కార్యకర్తల నుంచి డిమాండ్ వచ్చింది. కానీ బాబు మళ్ళీ ఆయనకే సీటు ఇచ్చారు…అయినా సరే నల్లపురెడ్డిపై ఓటమి పాలయ్యారు.

ఓడిపోయాక కోవూరులో టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు..దీంతో పార్టీ పరిస్తితి మెరుగు అవ్వలేదు..దీంతో ఇక్కడ అభ్యర్ధిని మార్చాలనే డిమాండ్ పెరిగింది. ఇప్పటికే పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి సీటు కోసం ట్రై చేస్తున్నారు..గత ఎన్నికల్లోనే సీటు కోసం ట్రై చేశారు గాని..సీటు రాలేదు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నంలో ఉన్నారు. మరి చూడాలి ఈ సారి కోవూరులో సరైన ప్రత్యర్ధి లేకపోతే నల్లపురెడ్డిని ఆపడం కష్టం అయిపోతుంది.

Discussion about this post