అదేంటి ఎంపీ స్థాయిలో ఉండేవారు ఎందుకు తెలియకుండా ఉంటారని అందరికీ డౌట్ రావొచ్చు..మిగతా రాష్ట్రాల్లో ఎంపీలు…వారి ప్రజలకు తెలుస్తారేమో గాని…మన ఏపీలో ఉండే ఎంపీలు మాత్రం..వారి సొంత నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియరు. అదే మన ఎంపీల గొప్పతనం. ఒకరిద్దరని కాదు…ఏపీలో చాలామంది ఎంపీలు పరిస్తితి అంతే. పాపం ప్రతిపక్షంలో ఉన్నా సరే టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, గల్లా జయదేవ్‌లు వారి పార్లమెంట్ స్థానాల ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు.

ఎందుకంటే వీరు ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో గళం విప్పుతారు..అలాగే ఎంపీ నిధులతో నియోజకవర్గాల్లో పనులు చేస్తారు. కానీ వైసీపీకి ఉన్న 22 మంది ఎంపీల్లో ఎక్కువ శాతం ఇలాంటి కార్యక్రమాలు ఏమి చేయరు. ఏదో ముగ్గురు, నలుగురు మినహా మిగిలిన ఎంపీల అందరిదీ అదే దారి. ఇక గొప్ప వింత ఏంటి…కొందరు ఎంపీలు అనే సంగతి..గెలిపించుకున్న ప్రజలకు కూడా తెలియదు. ఏదో జగన్ గాలిలో…జనమంతా వైసీపీకి ఓట్లు గుద్దేశారు..అలా వైసీపీ నుంచి ఎంపీలుగా గెలిచేసారంతే. ఆ తర్వాత వారు జనాలకు కనిపించేది లేదు.

వైసీపీలో చాలమంది ఎంపీలు ఇదే దారిలో ఉన్నారు. ఉదాహరణకు అమలాపురం ఎంపీ అని అడిగితే…రాజకీయాలు తెలిసినవారు కూడా త్వరగా సమాధానం చెప్పలేరు. ఆఖరికి అమలాపురం ప్రజలకు పెద్దగా సమాధానం తెలియదనే చెప్పొచ్చు. పాపం ఇప్పటికీ అమలాపురంలో కొందరు పెద్దోళ్ళు హర్షకుమార్ ఎంపీ అని అనుకుంటుంటారు. అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన హర్షకుమార్ ప్రజలకు గుర్తు ఉన్నారు.

ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న చింతా అనురాధా మాత్రం జనాలకు తెలియడం లేదు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి…ఒకో అసెంబ్లీలో సుమారు రెండు లక్షల ఓట్లు వేసుకుంటే…14 లక్షలు..అంటే 14 లక్షల మందికి ఎంపీ ప్రతినిధి..అలాంటి ఎంపీ ఎవరో ఎవరో తెలియకపోవడం వైసీపీ గొప్పతనమే అని చెప్పొచ్చు.

Discussion about this post