ఏపీలో ఎంతమంది మంత్రుల పనితీరు బాగుంది? ఎంతమంది ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తున్నారు? అంటే ఇక్కడొక వాస్తవం మాట్లాడుకోవాలి…అది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటే సీఎంల వన్ మ్యాన్ షో నడుస్తుంది. ఏదో మంత్రులు ఉన్నామా? అన్నట్లే ఉంటారు. అది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడైనా, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నా సరే. ఇక టీడీపీతో పోలిస్తే వైసీపీలో కాస్త పరిస్తితులు గడ్డుగానే ఉన్నాయని చెప్పొచ్చు. మంత్రులు పేరుకే ఉన్నట్లు కనిపిస్తున్నారు తప్ప…వారికి పూర్తి స్వేచ్ఛ కనిపించడం లేదు. సలహాదారుల చేతుల్లోనే మంత్రులు ఉన్నట్లు ఉన్నారు. కాబట్టి మంత్రుల పనితీరు గురించి చెప్పుకోవడం వేస్ట్ అని చెప్పొచ్చు.

కాకపోతే కనీసం జనాల్లో తిరుగుతూ, తమకు సాధ్యమైన మేర పనులు చేస్తూ ఉంటే బెటర్. కానీ ఏపీ మంత్రుల్లో చాలామంది అలా పనిచేయడంలో వెనుకబడే ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో ప్రతిపక్షాలని తిట్టడానికి ముందు ఉంటున్నారు గాని, పనిచేయడానికి ముందు ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకే చాలామంది మంత్రులు ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుంటున్నారు. అలా వ్యతిరేకత తెచ్చుకున్న వారిలో గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు కూడా ఉన్నారని చెప్పొచ్చు.

ఈయన శాఖకు సంబంధించి పనులు ఎక్కువగానే ఉన్నాయి…పైగా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పైనే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం, అందులో ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది. కానీ ఈ కార్యక్రమం సమర్ధవంతంగా జరుగుతున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే ఇళ్ల స్థలాల్లో అనేక అక్రమాలు జరిగాయని కథనాలు వచ్చాయి..అటు ఇళ్ల నిర్మాణంలో కూడా అలాగే జరుగుతుందని తెలుస్తోంది. దీంతో మంత్రికి నెగిటివ్ ఎక్కువ వస్తుంది.

ఇటు సొంత నియోజకవర్గం ఆచంటలో కూడా మంత్రి పరిస్తితి అంత ఆశాజనకంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇక్కడ కూడా మంత్రికి యాంటీ వస్తుంది. ఇదే క్రమంలో టీడీపీలో ఉన్న మాజీమంత్రి పితాని సత్యనారాయణ పికప్ అవుతున్నారు. ఈ పరిస్తితులని బేరీజు వేసుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో చెరుకువాడకు గెలిచే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి.

Discussion about this post