రాజకీయాల్లో నాయకులని గెలిపించేది ప్రజలకు మేలు చేయడానికి…కానీ ప్రజలకు మేలు చేయకుండా, ప్రజల్లో లేకుండా నాయకులని మళ్ళీ ఆదరించడం కష్టమైపోతుంది. అలాంటి నాయకులకు మళ్ళీ గెలిచే అవకాశాలు ప్రజలు ఇవ్వరు. ఇప్పుడు అలాంటి అవకాశాన్ని ఏపీలో కొందరు వైసీపీ ఎంపీలు కోల్పోబోతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల ముందు…కేంద్రం మెడలు వంచి హోదా తెచ్చిస్తానని, 25 ఎంపీలు ఇవ్వండి అని జగన్…ప్రజలని అడిగారు.

ఇక ప్రజలు కూడా జగన్ ఏదో సాధిస్తారు అనుకుని…25 కాకపోయినా 22 ఎంపీలు ఇచ్చారు. కానీ అక్కడ కేంద్రంలో బీజేపీ సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చింది…దీంతో జగన్ చేతులెత్తేశారు. సరే పాపం అక్కడ అవకాశం లేనప్పుడు జగన్ ఏం చేస్తారులే అని జనం అనుకున్నారు. అలా అని ఎంపీలు ఉత్సవ విగ్రహాలు మాదిరిగా ఉండకూడదుగా అని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. పేరుకు 22 మంది ఎంపీలు ఉన్నారు.

వీరిలో ఎంతమంది రాష్ట్రం కోసం పోరాడుతున్నారు…ఎంతమంది పార్లమెంట్ స్థానాల్లో పనిచేస్తున్నారు…ప్రజల్లో ఉంటున్నారు? అంటే ఆ విషయం జనాలకే బాగా తెలుసని చెప్పాలి. మెజారిటీ పార్లమెంట్ స్థానాల్లో వారి వారి ఎంపీలని జనం చూడని పరిస్తితి ఉందని అంటున్నారు. అంటే ఏదో జగన్ గాలిలో ఎంపీలు ఎవరు ఏంటి అనేది తెలుసుకోకుండా ప్రజలు గెలిపించేశారు. కానీ ఆ ఎంపీలు జనంలోకి వచ్చే సందర్భాలు తక్కువ. అసలు చాలా చోట్ల తమ తమ ఎంపీలు ఎవరో కూడా ప్రజలకు తెలియని పరిస్తితి ఉందని చెప్పొచ్చు అని అంటున్నారు.

అంటే ఏ స్థాయిలో ఎంపీలు పనిచేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు…కనీసం పార్లమెంట్ నిధులతో అయిన కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు..మరి ఆ కార్యక్రమాలైన చేస్తున్నారో లేదో తెలియడం లేదు. అందుకే ఇలాంటి ఎంపీలని మళ్ళీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ సారి సగంపైనే ఎంపీలకు షాక్ తగలడం ఖాయమని తెలుస్తోంది. అయితే జగన్ ముందే తెరుకుని, వారిని పక్కనబెట్టేసే అవకాశాలు కూడా లేకపోలేదు.

Discussion about this post