ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఎప్పటికప్పుడు రాజకీయ యుద్ధం తీవ్రమవుతున్న విషయం తెలిసిందే…అసలు ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు పైనే సమయం ఉండగానే రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి….రెండు పార్టీల నేతలు మధ్య మాటల యుద్ధం తీవ్రంగానే జరుగుతుంది…తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాల మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది…అది కూడా అచ్చెన్న కామెంట్లకు రోజా ఇచ్చిన కౌంటర్లతోనే రచ్చ మొదలైంది.


ఈ మధ్య అచ్ఛెన్న దూకుడుగా రాజకీయం చేస్తున్నారు…అసలు వైసీపీ పని అయిపోయిందని, ఇంకా అధికారంలోకి వచ్చేది టీడీపీనే అని, 160 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తామని అచ్చెన్న చెబుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో అచ్చెన్నకు రోజా కౌంటర్ ఇస్తూ…160 సీట్లు కాదు కదా..మళ్ళీ 23 సీట్లు గెలుచుకుంటే గొప్ప అన్నట్లు రోజా సెటైర్ వేశారు. ఇదే క్రమంలో అచ్చెన్న సైతం కూడా…రోజాకు కౌంటర్ ఇచ్చేశారు..ఇప్పుడు రోజా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ నగరి బరిలో నిలిచి గెలిస్తే…ఇంకా రానున్న ఎన్నికల్లో నగరిలో పోటీ చేయమని అచ్చెన్న సవాల్ విసిరారు.

అచ్చెన్న సవాల్‌కు రోజా స్పందించడకుండా ఉండరు కదా…కాబట్టి వెంటనే రోజా కూడా స్పందిస్తూ…టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్ విసిరారు..మళ్ళీ అచెన్న వచ్చేసరికి..ఇప్పుడే ఎన్నికలకు వెళ్దామని, ఎవరి సత్తా ఏంటో తేలుతుందని అన్నారు. ఇలా ఇద్దరు నేతల మధ్య సవాళ్ళ పర్వం నడిచింది. కానీ ఎవరు కూడా ఒకరి సవాల్‌ని మరొకరు స్వీకరించే పరిస్తితి కనిపించడం లేదు. ఏదో పైకి రాజకీయం కోసం సవాళ్ళు విసురుకుంటారు తప్ప…సవాల్ స్వీకరించే పరిస్తితి లేదు..కాబట్టి ఇవన్నీ ఉత్తుత్తి సవాళ్ళు అని చెప్పొచ్చు.

అయితే ఇక్కడ నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే చర్చ కూడా వస్తుంది…ఎలాగో నెక్స్ట్ ఎన్నికల్లో అచ్చెన్న, రోజా తమ తమ నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సిందే. అలాంటప్పుడు నగరిలో మళ్ళీ రోజాకు, టెక్కలిలో మళ్ళీ అచ్చెన్నకు గెలిచే ఛాన్స్ ఉందా? అంటే వీరిలో రోజాకు కాస్త గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో వీరి భవిష్యత్ ఎలా ఉంటుందో.


Discussion about this post