టీడీపీ అధికారంలోకి వస్తే.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ఏ మంత్రి పదవి వస్తుంది? ఆయన కోరుకున్నట్టుగా హోం శాఖ ఆయనకు దక్కితే.. ఆయన ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తారు అన్ని విషయాలు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ఆయనను అరెస్ట్ చేసినప్పుడు జగన్ ప్రభు త్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మళ్లీ మా పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు చంద్రబాబుని అడిగి హోం శాఖను తీసుకుంటానని, హోం శాఖ మంత్రి అయిన తర్వాత ఏం చేయాలో చూస్తానని.. `ఖబడ్దార్` అంటూ పోలీసులను ఆయన హెచ్చరించారు.

దీంతో రేపు టిడిపి అధికారంలోకి వస్తే అచ్చం నాయుడు ఏ మంత్రి అవుతారు? ఆయన కోరుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఆయనకు హోం శాఖ మంత్రిని చేస్తారా? అనే విషయంపై టీడీపీలో జోరుగా చర్చ సాగుతోంది. నిజానికి ఇప్పటివరకు ఉన్నటు వంటి అంశాలను పరిశీలిస్తే. అచ్చెన్న దూకుడు, ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలు వంటివి ఇటు పార్టీలోనూ అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హీటెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఖచ్చితంగా చంద్రబాబు ఈయనకు మంత్రి పదవి ఇస్తారని, అది కూడా హోం శాఖ గ్యారెంటీ అని పార్టీలో నేతలు చెప్పుకొంటున్నారు.

వాస్తవానికి గతంలోనూ మంత్రిగా పనిచేసిన అచ్చెన్న.. తనదైన మార్కు వేశారు. ఎక్కడా అవినీతి లేకుం డా.. ఆయన తన శాఖకు వన్నె తెచ్చారు. ఇప్పుడు పార్టీ క్లిష్టపరిస్తితిలో ఉంది. ఈనేపథ్యంలో పార్టీని నిలబె ట్టేందుకు ఆయన శ్రమిస్తున్నారనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన హోంశాఖను తీసుకోవడం ద్వారా ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను వైసీపీ విషయంలో నిజం చేయాలని చూస్తున్నారు.

అంటే.. ఎలాంటి తప్పుడు కేసులతో తమ ను ఇబ్బంది పెట్టారో.. అలాకాకపోయినా.. ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఎత్తి చూపి.. ఇప్పుడు పాలన చేస్తున్నవారిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. నిజానికి టిడిపి నాయకులు అనేక మంది తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న మాట వాస్తవం. దీంతో వారంతా కూడా లబోదిబోమంటున్నారు. ఎందుకంటే చేయని తప్పులకు కూడా వారిపై కేసు నమోదు చేయడం జైలుకు పంపించడం రాజకీయ దురుద్దేశంతో జరిగిన వేనని అందరికీ తెలిసిందే.

అందుకే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దారుణంగా వాడుకుంటోందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. దేశంలో ఇంతగా దిగజారిన ప్రభుత్వం ఏదీ లేదని వారు పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను సంస్కరించడం తోపాటు పోలీసు వ్యవస్థను అన్ని వర్గాలకు చేరువ చేయాలని కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అచ్చెన్న వంటి సమర్ధుడుకు ఈ అవకాశం ఖచ్చితంగా దక్కుతుందని నాయకులు భావిస్తుండడం గమనార్హం.

Discussion about this post