సాధారణంగా సీఎం స్థాయి వ్యక్తి..ఒక నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడం జరిగే పని కాదు…ఏదో రాష్ట్ర స్థాయిలో ఫోకస్ పెట్టి ప్రత్యర్ధులకు చెక్ పెట్టాలని అనుకుంటారు..గానీ ఒక నియోజకవర్గ స్థాయిలో నేతకు చెక్ పెట్టాలని పెద్దగా అనుకోరు. కానీ ఏపీ రాజకీయాల్లో ఒకోసారి కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న బలమైన ప్రత్యర్ధులని ఓడించడానికి స్పెషల్ ఫోకస్ పెడతారు. అలా ఇప్పుడు సీఎం జగన్…అద్దంకి నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. సైలెంట్‌గా ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ని ఓడించాలని చూస్తున్నారు.

ఇక ఈయనపైనే ఎందుకు ఫోకస్ పెట్టారో అందరికీ తెలిసిందే. ఈయన 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అలా వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. కానీ ఒక్క గొట్టిపాటి మాత్రం జగన్ గాలిని సైతం ఎదురుకుని సత్తా చాటారు. ఇలా టీడీపీ తరుపున గెలిచిన గొట్టిపాటికి ఎక్కడకక్కడ చెక్ పెట్టడానికి చూస్తున్నారు. ముందు ఆయన ఆర్ధికమూలాలని దెబ్బతీయడానికి చూశారు గానీ..ఆయన గ్రానైట్ వ్యాపారాలపై దాడులు చేయించారు. కానీ ఎన్ని జరిగినా గొట్టిపాటి వెనుకడుగు వేయలేదు. కోర్టు వెళ్ళి మరీ వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు.

అలాగే నియోజకవర్గంలో బలంగా ఉన్న ద్వితీయ శ్రేణి టీడీపీ నేతలని వైసీపీలోకి తీసుకొచ్చారు. నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ బాచిన కృష్ణచైతన్య…టీడీపీ క్యాడర్‌పై ఫోకస్ చేసి…పార్టీలోకి తీసుకొచ్చారు. అలాగే అద్దంకిలో కరణం బలరాం వర్గం కూడా ఉంది. ఇక కరణం ఫ్యామిలీ ద్వారా..ఆ వర్గాన్ని కూడా వైసీపీ వైపు మొగ్గు చూపేలా ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఏదో అధికారంలో ఉంది కాబట్టి కొందరు టీడీపీ నేతలు…వైసీపీలో చేరారు గానీ నెక్స్ట్ ఎన్నికల ముందు..మళ్ళీ వారు టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటు అద్దంకిలో ఉన్న కరణం వర్గం సైతం టీడీపీకే సపోర్ట్ ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే అద్దంకిలో గొట్టిపాటికి చెక్ పెట్టాలని వైసీపీ నానా పాట్లు పడుతుంది గానీ…పెద్దగా ఉపయోగం ఉండటంలేదు.

Discussion about this post