ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పుంజుకుంటోంది. ఇప్పటి వరకు పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు.. ప్రజలకు తగు లుతున్న ధరల సెగ ను పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంది. ఇది పార్టీకి బాగా కలిసివస్తోందని అంటు న్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పెంచిన ధరలు .. పొరుగు రాష్ట్రాల్లో కూడా లేక పోవడంతో ఏపీలో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ సమయంలో ఖచ్చితంగా.. ప్రధాన ప్రతిపక్షం ప్రజల నాడిని పట్టుకుంది. మాజీ సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రజల మధ్యకు వచ్చారు.

దీంతో ప్రజల సాధక బాధలు చెప్పుకొనేందుకు అవకాశం ఏర్పడింది. తాజాగా ఆయన పర్యటించిన శ్రీకాకు ళం, విశాఖల్లో ప్రజల నుంచి ధరల గోడు గొప్పగా వినిపించింది. తాము జీవనం సాగించలేక పోతున్నామని.. చాలా మంది ప్రజలు చంద్రబాబు వద్ద చెప్పుకొన్నారు. అదేసమయంలో టీడీపీ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదని చాలా మంది చెప్పుకొని రావడం.. విశేషం.

ఈ క్రమంలో టీడీపీ రాబోయే రోజుల్లో బాదుడే-బాదుడు కార్యక్రమాన్ని మరింత తీవ్ర తరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెలలో నిర్వహించనున్న మహానాడు అనంతరం.. ప్రజల్లోనే ఉండాలని.. చంద్రబాబు నిర్ణయించు కున్నారు. వారి సమస్యలు వినడంతోపాటు.. ప్రభుత్వంపై ఆయన మరింత దూకుడు పెంచనున్నారు. ఇది పార్టీకి పాశుపతాస్త్రంలా పనిచేయనుందని అంటున్నారు.

ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు, వ్యాపార వర్గాలను సంఘటితం చేసేలా .. టీడీపీ వ్యూహం ఉండనుంది. ఇది.. ఇప్పటి వరకు టీడీపీ విధానాన్ని యూటర్న్ తీసుకునేలా చేయడంతోపాటు.. పార్టీకి ప్రజల్లో మరింత ఇమేజ్ తీసుకురావడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Discussion about this post