ఏపీలో జగన్‌కు చెక్ పెట్టేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం పట్ల కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారు. అలా అని వైసీపీ పూర్తిగా దిగజారిపోయిందని అనుకోవడానికి లేదు. ఆ పార్టీకి ఇంకా మెజారిటీ కనిపిస్తోంది. అంటే చంద్రబాబు ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు కష్టానికి పవన్ కల్యాణ్ తోడైతే జగన్‌కు చెక్ పెట్టడం సులువే అని ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.

కానీ వీరి మధ్యలో బీజేపీ ఉంది..రాష్ట్రంలో బీజేపీకి ఎలాగో బలం లేదు…కాకపోతే కేంద్రంలో బీజేపీ స్ట్రాంగ్…కాబట్టి ఆ పార్టీ కూడా సపోర్ట్ ఉంటే కాస్త బెనిఫిట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే బీజేపీ ఇప్పటికే టీడీపీతో పొత్తు ఉండే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది. అలా అని టీడీపీకి పొత్తు పెట్టుకోవాలనే ఆసక్తి కూడా లేనట్లే ఉంది. కాకపోతే బీజేపీతో జనసేన పొత్తులో ఉంది కాబట్టి…పవన్ టీడీపీకి దగ్గరవ్వాలంటే బీజేపీ కూడా దగ్గరవ్వాలి. బీజేపీ ఎలాగో టీడీపీకి దూరంగానే ఉంటామని చెబుతుంది.

అంటే పవన్ కల్యాణ్ ఇంకా బీజేపీకి దూరం జరగాల్సిన పరిస్తితి ఉంది. ఎందుకంటే బీజేపీ వల్ల జనసేనకు వచ్చిన ఉపయోగం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీలో దిగితే జనసేనకి ఒరిగేది ఏమి లేదు. ఈ రెండు పార్టీలు కలిసి జగన్‌కు చెక్ పెట్టలేవు. పైగా టీడీపీ ఓట్లు చీల్చి జగన్‌కు బెనిఫిట్ చేస్తాయి. ఆ విషయం పవన్‌కు కూడా అర్ధమవుతుంది. అందుకే పవన్ సైతం బీజేపీకి దూరమైతేనే బెటర్ అనే ఆలోచనలో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.

టీడీపీతో కలిస్తే కనీసం ఓ 20 సీట్లు అయిన గెలుచుకునే అవకాశం జనసేనకు దక్కుతుంది. కాబట్టి రాజకీయంగా ఆలోచిస్తే పవన్ బీజేపీని వదిలేసి..టీడీపీతో కలిసి నడవటం ఖాయమని తెలుస్తోంది. బీజేపీ కూడా కలిస్తే ఓకే లేదంటే పవన్ బీజేపీని వదిలేయడం గ్యారెంటీ.

Discussion about this post