May 31, 2023
ap news latest TDP latest News YCP latest news

అద్దంకిలో వైసీపీకి రివర్స్..చైతన్యకు కలిసిరావడం లేదుగా!

ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో వైసీపీకి పట్టు దొరకడం లేదు. అక్కడ టి‌డి‌పి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు చెక్ పెట్టడంలో వైసీపీ వెనుకబడి ఉంది. అద్దంకిలో గత మూడు ఎన్నికల నుంచి గొట్టిపాటి హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఏ పార్టీలో పోటీ చేసిన గెలుపు మాత్రం ఖాయం అన్నట్లు ఉంది. 2009లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు.

ఇక 2019 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో కూడా టి‌డి‌పి నుంచి బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక గొట్టిపాటిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్నీ రకాలుగా పెట్టారు. ఆయన వ్యాపారాలని దెబ్బతీసి ఆర్ధిక పరంగా చెక్ పెట్టాలని చూశారు. కానీ ఎన్ని చేసిన గొట్టిపాటి అదరలేదు. అలాగే పార్టీలో నిలబడి పోరాడుతున్నారు. దీంతో అద్దంకి ప్రజల్లో గొట్టిపాటిపై మరింత సానుభూతి పెరిగింది.

ఇక గొట్టిపాటికి చెక్ పెట్టడానికి సీనియర్ నేత బాచిన గరటయ్య వారసుడు కృష్ణచైతన్యని బరిలో దింపారు. అయినా సరే అద్దంకిలో వైసీపీకి ఆధిక్యం రావడం లేదు. ఇక్కడ గొట్టిపాటికి చెక్ పెట్టే బలం చైతన్యకు లేదని సొంత పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అలాగే పార్టీలో ఆధిపత్య పోరు ఉంది.

ఈ క్రమంలోనే చైతన్యకు సీటు ఇవ్వరనే ప్రచారం వస్తుంది. దీంతో ఆయన వర్గం సీరియస్ గా ఉంది. ఇలా అద్దంకి వైసీపీలో ఏ మాత్రం క్లారిటీ లేకుండా ఉంది. అయితే ఎవరు బరిలో దిగిన అద్దంకిలో మాత్రం గొట్టిపాటి విజయానికి బ్రేక్ వేయడం కష్టమనే పరిస్తితి ఉంది.