ఏపీలో జగన్ ప్రభుత్వం ఆదాయం పెరిగే మార్గాలని బాగా అన్వేషిస్తుంది. ఎప్పటికప్పుడు ఆదాయం సృష్టిస్తూ అసలు అప్పుల భారం పడకుండా చూసుకుంటుంది. అలాగే ప్రజలకు కూడా జగనన్న ఆదాయం వచ్చే మార్గాలని ఎప్పటికప్పుడు చెబుతున్నారు…అయితే ఈ మాటలు రియాలిటీలో జరుగుతున్నాయా? అంటే అది జగన్ ప్రభుత్వానికి, జనాలకే తెలియాలి అని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం అసలు అప్పులు ఎలా చేసిందో అందరికీ తెలుసు.

నెల నెల అప్పు చేయనిదే గడవలేని పరిస్తితి. అప్పులు ఎందుకు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆదాయాన్ని సృష్టించవచ్చు కదా అనుకుంటే….జగన్ ప్రభుత్వం అభివృద్ధికి చాలా దూరంగా ఉంటుంది. ఎంతసేపు అప్పులు తీసుకురావడం, అలాగే పన్నుల భారం పెంచి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం. ఇదే గత రెండున్నర ఏళ్లుగా జగన్ ప్రభుత్వం చేస్తున్న పని అని ప్రతి ఒక్కరికి తెలుసు.

అయితే ఇంతకుమించి జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమం ఏమి లేదని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. పైగా గొప్ప విషయం ఏంటంటే….అప్పులు చేయని, ఏదొకటి చేయని సమయానికి పథకాలు మాత్రం ఇస్తున్నారు. అయితే ఈ పథకాల వల్ల ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని జగన్ సెలవివ్వడం ఆశ్చర్యంగా ఉందని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇంతకన్నా కామెడీ ఏం ఉంటుందన్న సెటైర్లు కూడా పడుతున్నాయి.

పేద కుటుంబాల ఆదాయాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వం నవరత్నాల ద్వారా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ప్రతి కుటుంబం ఆదాయాన్ని పెంచడం ద్వారా రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి చెంది రాష్ట్రాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కాగలుగుతారన్నారని జగనన్న చెప్పుకొచ్చారు.

అంటే పథకాల వల్ల ప్రతి కుటుంబం ఆదాయం పెరిగి….ఆనందంగా ఉంటున్నారని చెబుతున్నారు. అసలు పథకాల వల్ల ఎంత లాభం జరుగుతుందో తెలియదు గానీ, జగన్ ప్రభుత్వం పెంచిన ఛార్జీలు, పన్నుల భారం వల్ల ప్రజల పరిస్తితి మరీ దరిద్రంగా తయారైంది. ఆ విషయం జగన్‌కు త్వరలోనే అర్ధమవుతుందని అంటున్నారు.

Discussion about this post