గత ఎన్నికల్లో జగన్ గాలిలో టిడిపిలో సీనియర్ లేదు జూనియర్ లేదు అంతా ఓటమి బాటపట్టిన విషయం తెలిసిందే. ఏదో కొంతమంది మాత్రం గెలిచి బయటపడ్డారు. ఇక ఎప్పుడు ఓటమి ఎరగని నేతలు సైతం ఓడిపోయారు. అలా ఓడిపోయిన నేతలు ఇప్పుడు వేగంగా పుంజుకుంటున్నారు. ముఖ్యంగా సీనియర్ నేతలు సత్తా చాటుతున్నారు.
టిడిపిలో సీనియర్లు విజయం దిశగా వెళుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయి..ఇప్పుడు ఆ ఓటమికి రివెంజ్ తీర్చుకునే దిశగా వెళుతున్నారు. ఈ సారి కొందరు సీనియర్లు పక్కాగా గెలవడం ఖాయమని తెలుస్తోంది. అలా పక్కాగా గెలుపు దక్కించుకునేవారిలో అయ్యన్నపాత్రుడు ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. నర్సీపట్నంలో గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ సారి మాత్రం అక్కడ టిడిపి జెండా ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి సైతం ఈ సారి గెలుపు బాటలో వెళుతున్నారు.

అటు గత ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అశోక్ గజపతి రాజు…ఈ సారి గెలుపు గుర్రం ఎక్కడం పక్కా అని చెప్పవచ్చు. అలాగే ఎచ్చెర్లలో కిమిడి కళా వెంకట్రావు సైతం గెలుపు దిశగా వెళుతున్నారు. ఇటు మైలవరంలో దేవినేని ఉమా రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో తొలిసారి ఆయన ఓటమి పాలయ్యారు. ఈ సారి మైలవరంలో ఉమా గెలుపు ఖాయం చేసుకున్నారు.

ఇక పొన్నూరులో వరుసగా అయిదుసార్లు గెలిచి..ఆరోసారి ఓటమి పాలైన ధూళిపాళ్ళ నరేంద్ర..ఈ సారి డౌట్ లేకుండా గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, పలమనేరులో అమర్నాథ్ రెడ్డి, తాడిపత్రిలో జేసి ప్రభాకర్ రెడ్డి, పెనుకొండలో బికే పార్థసారథి, బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి, కర్నూలు ఎంపీగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఈ సారి గెలుపు గుర్రం ఎక్కేలా ఉన్నారు.