సాధారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా పట్టు లేని విషయం తెలిసిందే. ఎప్పుడో 1999 ఎన్నికల్లోనే అక్కడ టిడిపి సత్తా చాటింది..ఆ తర్వాత నుంచి సత్తా చాటలేకపోతుంది. అయితే ఈ సారి ఎన్నికల్లో జిల్లాలో టిడిపి పట్టు బిగిస్తుంది..వైసీపీకి చెక్ పెట్టి ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని చూస్తుంది. ఇదే క్రమంలో వరుసగా వైసీపీ గెలుస్తున్న ఆదోని సీటుపై టిడిపి పట్టు బిగించింది.
ఆదోనిలో టిడిపి ఇప్పటివరకు నాలుగుసార్లు గెలిచింది. 1983, 1994, 1999, 2009 ఎన్నికల్లో అక్కడ టిడిపి గెలిచింది. అందులో మూడుసార్లు టిడిపి నుంచి మీనాక్షి నాయుడు గెలిచారు. ఇక గత రెండు ఎన్నికల్లో మీనాక్షి నాయుడు పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి వై. సాయిప్రసాద్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని మీనాక్షి గట్టిగా కష్టపడుతున్నారు. పైగా అక్కడ టిడిపి బలం పెరిగింది. దీంతో మీనాక్షికి ఛాన్స్ కనిపిస్తుంది.

అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి పెద్దగా అనుకూల వాతావరణం లేదు. వ్యతిరేకత కనిపిస్తుంది. రెండుసార్లు గెలిచిన సరే ఆదోనిలో అభివృద్ధి తక్కువే. ఇదే సమయంలో మీనాక్షి నాయుడు ప్రజల్లో ఉంటున్నారు..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇక ఆ మధ్య చంద్రబాబు ఆదోని పర్యటనకు వచ్చినప్పుడు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది.
ఆ తర్వాత నుంచే టిడిపికి కొత్త ఊపు వచ్చింది. దీంతో ఆదోనిలో టిడిపికి ఆదరణ పెరిగిందని అర్ధమవుతుంది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో మీనాక్షి గెలుపు ఖాయమని లేటెస్ట్ సర్వేలు కూడా చెబుతున్నాయి. దీంతో ఈ సారి ఆదోనిలో వైసీపీకి మూడో ఛాన్స్ లేనట్లే అని చెప్పవచ్చు.